సంతోషమైన జీవితానికి ఓ మహర్షి చెప్పిన త్రిసూత్రాలు

Markhandeya Swami told 3 ways for happy life

10:54 AM ON 8th February, 2017 By Mirchi Vilas

Markhandeya Swami told 3 ways for happy life

మనిషి ఎంత సంపాయించినా , ఎన్ని పదవులు వచ్చినా, ఎంతమంది జనం వెనుక వున్నా సరే ఎదో అసంతృప్తి వెంటాడుతోనే ఉంటుంది. ఇక ఒక్కోసారి ఆ సమస్యలకి పరిష్కారం మనచుట్టూనే ఉంటుంది. అయినా మదన పడిపోతుంటాం. నిజానికి మన పురాణాల రూపంలో ఎన్నో పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. అయితే పురాణాలను పుక్కిటి పురాణాలని పక్కన పడేశాం.. కానీ ఇప్పుడు వాటిప్రాశస్త్యాన్ని కొద్దికొద్దిగా తెలుసుకుంటున్నాం..ఇపుుడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రైసెస్ మేనేజ్మెంట్లు అదే అప్పుడు మునులు, రుషులు చూపించిన మార్గాలు.. అలాంటి మార్గాలలో ఒకటి మహా మ్రుత్యుంజయ మంత్రాన్ని మనకీ అందించిన మహర్షి మార్కండేయ చూపించిన జీవిత మార్గం కీలకలమైంది. ముఖ్యంగా ఆయన త్రిసూత్రాలు ప్రతిపాదించాడు. వాటి వివరాల్లోకి వెళ్తే,

1/4 Pages

సరైన స్నేహం....

ముందుగా నీ స్నేహితులే నీ వ్యక్తిత్వం.. నువ్వు నీ స్నేహితులతో గడిపే సమయమే నీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందన్నది తెలుసుకోవాలి. ఉరకలేసే ఉత్సాహం, పాజిటివ్ ద్రుక్పథం ఉన్న స్నేహితులు ఎలా అయితే నీలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతారో.. నెగిటివ్ ఆలోచనలు, నిర్లిప్తత, నిరుత్సాహంలో ఉండే వ్యక్తులు నిన్ను కూడా తెలియని దుఃఖంలో కూరుకుపోయేలా చేయగలరు. అది గమనించి నడుచుకుంటే ఇక తిరుగుండదు.

English summary

Markhandeya maharshi told three ways to lead a happy life.