ఐస్ క్రీం వల్ల పెళ్లి ఆగిపోయింది

Marriage cancelled due to ice cream

10:13 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Marriage cancelled due to ice cream

సినిమాల్లో చాలా సార్లు పీటల పై పెళ్లిలు ఆగిపోయాయని వింటుంటాం. దానికి సవాలక్ష కారణాలు ఉంటాయి.. కానీ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ పెళ్లిలో మాత్రం సినిమాలో జరిగినట్టే జరిగింది. అసలు ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. అసలు విషయంలోకి వెళ్తే ఎక్కడైనా పెళ్లిళ్లు ఆగిపోతాయి అంటే దానికి ప్రధాన కారణం కట్నం డబ్బులు. లేదంటే బంధువుల మధ్య గొడవలు అదీ లేదంటే పెళ్లి కొడుక్కి మరో పెళ్లి లాంటి కారణాలు విని ఉంటారు. కానీ ఐస్ క్రీమ్ వల్ల ఎక్కడైనా పెళ్లి ఆగుతుందా? బలం లేకుంటే అరటి పండు తిన్నా పళ్లు విరుగుతుంది అన్న చందాన.. ఐస్ క్రీమ్ కోసం ఓ పెళ్లి తంతు ఆగిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఓ ప్రాంతంలో వధువు ఇంటి వద్ద పెళ్లి వేడుకు అంగరంగవైభంగా జరగుతోంది. వరుడి తరుపు చుట్టాలు భోజనం ఆరగిస్తున్నారు. అయితే వరుడి తరపు నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఐస్‌ క్రీం గురించి గొడవ మొదలెట్టారు. తమకు కావాల్సినంత ఐస్‌క్రీం లేదంటూ తగాదాకు దిగారు. అది చిలికి చిలికి గాలి వానగా మారింది. చివరకు రెండు పక్షాల వారు గొడవకు దిగారు. ఆఖరుకి పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వధువు తరఫు బంధువులు ఏకంగా రాళ్ల దాడికి తెగబడ్డారు. దాంతో ఏకంగా పెళ్లి ఆగిపోయింది.

English summary

Marriage cancelled due to ice cream. Marriage cancelled in Uttar Pradesh due to Ice Cream shortage.