నిశ్చితార్థ వేడుకలో వధువు చెంప చెళ్లు మంది!!

Marriage Cancelled For Beating Bride By Bridegroom

12:27 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Marriage Cancelled For Beating Bride By Bridegroom

పెళ్లి కన్నా సందడిగా నిశ్చితార్థ వేడుక జరిపించేస్తున్నారు. ఈ వేడుకతో సగం పెళ్లి అయిపోయినట్టే. అందుకే కాబోయే వధూవరులను పక్కన నిలబెట్టి , కూర్చోబెట్టి అక్షింతలు వేసేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుక ఆసక్తికరంగా మారి , చివరకు వివాదాస్పద పరిణామాలకు దారితీసింది. మొత్తానికి రచ్చ రచ్చ అయింది. ఫిరోజ్‌బాద్ జిల్లాలోని రసూల్‌పూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో మేధూ గ్రామానికి చెందిన గుడియా అనే యువతికి, దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన జితేంద్రా అనే యువకుడికి నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో అందరూ ఆనందంగా పాలుపంచుకున్నారు. అయితే నిశ్చితార్థంలో జితేంద్రా తనతో డ్యాన్స్ చేయాల్సిందిగా కాబోయే భార్య అయిన వధువు గుడియాను కోరాడు. దానికి ఆమె నో చెప్పింది. దీంతో ఫ్రెండ్స్ అందరి ముందు తనకు అవమానం జరిగిందన్న అహం అతని లో ఆవేశం తట్టిలేపింది. అంతే ఇక వెనకా ముందూ చూడలేదు, ఆమెను చెంపదెబ్బ కొట్టేసాడు. దీంతో నిశ్చితార్థ వేడుక కాస్తా రూటు మారింది. పెళ్లి కొడుకుతో వధువు తల్లిదండ్రులు, బంధువులు గొడవ పడ్డారు. తనకీ పెళ్ళి ఇష్టం లేదని, ఇలాంటి రౌడీని తాను చేసుకోనని చెప్పి ఆ వేడుక ప్రాంగణం నుంచి వధువు వెళ్లిపోయింది. ఇంకా నయం పెళ్లి పీటల మీద ఇలాంటి ఘటన జరిగి వుంటే , పెళ్ళే హుష్ కాకి ... అందుకే ముందే నిజం స్వరూపం బయటపడడంతో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

English summary

In an Engagement function in Rasoolpur in Firozabad District in Uttar Pradesh BrideGroom beats Bride in front of all the relatives for not dancing with him in the function. Later Bride relatives beat Bridegroom .Bride left that place b y saying that she will not marry a punt.