భర్తకు బుద్ధి చెప్పమని పిలిస్తే.. నిన్నే పెళ్లాడతానన్న కౌన్సిలర్?

Marriage Counsellor Asked Married Woman To Marry Him

11:57 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Marriage Counsellor Asked Married Woman To Marry Him

అవునా, అంటే అవుననే విధంగా వుంది ఈ ఘటన. పెద్దగా పిలిస్తే, వక్ర బుద్ధి ప్రదర్శించిన ఓ కౌన్సిలర్ వ్యవహరం ఇది ... చెడు తిరుగుళ్లు తిరుగుతూ.. నిత్యం వేధిస్తూ వస్తున్న తన భర్తను మందలించి బుద్ధి చెప్పాలని కౌన్సిలర్‌ను ఓ మహిళ తన ఇంటికి పిలిచింది . దీంతో ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్.. భర్తకు బుద్ధి చెప్పడం అటుంచి.. ఆ మహిళనే పెళ్లాడతాననే ప్రతిపాదన చేశాడు. దీంతో ఆ మహిళ నోట మాట లేదట. ఈ ఘటన ను ఓ సారి పరిశీలిస్తే, నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి కాపురంలో ఐదునెలలుగా కలతలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె కు ఏమిచేయాలో పాలుపోక, పెద్ద మనిషి కదా అనే ఉద్దేశంతో వార్డు కౌన్సిలర్‌ వద్దకు వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించింది. తన భర్తకు కాస్త భయం చెప్పాలని అడిగింది.

ఇవి కూడా చదవండి: మోహన్ బాబుకి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ ఫాన్స్

సరేనని ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్‌ కన్ను ఆమెపై పడింది. నిన్నే పెళ్ళడతానంటూ ప్రతిపాదన చేసాడు అంతటితో ఆగలేదు. వత్తిడి పెంచాడు. అన్ని రకాల వత్తిళ్ళు , చివరకు దాడికి కూడా తెగబడ్డాడు. ఆమె భర్త పై దాడి చేయించి, బంధువులను బెదిరిస్తున్నాడని.. ఆ మహిళను తానే వివాహం చేసుకుంటానని చెబుతున్నాడని ఆమె తరపు బంధువులు వాపోతున్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని కూడా గర్వంతో ఊగిపోతున్నాడని, బెదిరిస్తున్నాడని బందువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి జగదీశ్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కూడా వారు ప్రకటించారు. ఆ కౌన్సిలర్ కి ఇదేం పోయేకాలమని పలువురు తిట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:మగాడ్ని రేప్ చేసి దాన్ని ఎత్తుకెళ్ళారు(వీడియో)

ఇవి కూడా చదవండి:తనతో పెళ్ళికి ఒప్పుకోలేదని కారులోనుంచి తోసేశాడు

English summary

A Marriage Counsellor in Telangana asked married woman to Marry him. She was complained on this in this incident and she said she asked him to give counselling to her husband.