పెళ్ళికొడుకు లేడు ... అయినా పెళ్లయింది... ఎలా ?

Marriage happened without bridegroom in Tamilnadu

11:13 AM ON 30th January, 2017 By Mirchi Vilas

Marriage happened without bridegroom in Tamilnadu

పెళ్లంటే నూరేళ్ళ పంట ... పెళ్లి కొడుకు - పెళ్లి కూతురు ఉంటేనే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. కానీ అక్కడ వరుడు లేకుండానే పెళ్లి అయింది. ఇదేం పెళ్లి ... అయినా , అదెలా? అనుకుంటున్నారా? తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ఈ విచిత్రం జరిగింది. పైగా బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, పద్మనాభపురానికి చెందిన సోఫియాకు, పేచ్చిపారైకి చెందిన అజారుద్దీన్‌కు కొద్ది రోజులకు ముందు ముస్లిం సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరిగింది. అజారుద్దీన్ సౌదీలో ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం పద్మనాభపురంలోని ఓ కళ్యాణ మండపంలో వీరిరువురి పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. గురువారం అజారుద్దీన ఇండియాకు వచ్చేందుకు సౌదీ విమానాశ్రయానికి కారులో బయలుదేరాడు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయాడు. దీంతో ఫ్లైట్‌ మిస్సయ్యాడు. పెళ్లి ముహూర్తానికి వరుడు అజారుద్దీన్ రాలేడని తెలుసుకున్న ఇరువైపు బంధువులు నిరాశ చెందలేదు. వరుడు లేకపోయినా పర్వాలేదు.. పెళ్లి జరిపి తీరుతామంటూ ప్రకటించారు. ఆ మేరకు వధువు సోఫియా మెడలో అజారుద్దీన్ చెల్లెలు సూత్రధారణ చేసింది. పెళ్లికి విచ్చేసినవారంతా వధువుకు ఆశీర్వచనాలు, కానుకలు అందజేశారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు అంగీకార పత్రాలపై సంతకాలు పెడితేనే సగం పెళ్లయినట్లని, కనుక సోఫియాకు పెళ్లి అయినట్టుగానే పరిగణిస్తామని పెద్దలు చెప్పుకొచ్చారు. అయినా ఆడపడచు అర్ధమొగుడు అన్నారు కదా.

ఇది కూడా చూడండి: వామ్మో ... అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ !?

ఇది కూడా చూడండి: సోడా మిక్స్ చేసి ... రక్తం తాగేస్తున్నారు!

English summary

It was surprising to all chennai people that one tamilian Azaruddin marriage happened without him becuase bridegroom missed flight but marriage happened between them.