మోటో జి(జెన్ 2)కి మార్ష్ మాలో అప్‌డేట్..

Marshmallow update to Moto G (2nd Gen)

01:17 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Marshmallow update to  Moto G (2nd Gen)

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉకరణాల తయారీ సంస్థ లెనోవో అనుబంధ సంస్త మోటో తన మోటో జి(జెన్ 2)స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో అప్‌డేట్‌ను అందిస్తోంది. యూజర్లు ఇప్పుడు దీన్ని తమ డివైస్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి 'ABOUT PHONE > SYSTEM UPDATES'ను ఓపెన్ చేస్తే డివైస్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటూ మెసేజ్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే చాలు కొత్త సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయి, డివైస్ నూతన వెర్షన్‌కు అప్‌డేట్ అవుతుంది. ఈ కొత్త వెర్షన్‌లో యాప్ పర్మిషన్లు, గూగుల్ నౌ, ఆండ్రాయిడ్ పే మొబైల్ పేమెంట్ సిస్టమ్, ఫింగర్‌ప్రింట్ ఏపీఐ వంటి ఫీచర్లను, పలు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తున్నారు. ఈ అప్‌డేట్ ద్వారా మోటో జి (జెన్ 2) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో డివైస్‌ల జాబితాలోకి వెళ్లగా త్వరలో మరిన్ని ఫోన్లకు ఈ కొత్త అప్‌డేట్‌ను అందించనున్నట్టు మోటో ప్రతినిధులు తెలియజేసింది.

English summary

The Android 6.0 Marshmallow update was given to second-generation Motorola Moto G smartphone.The users can get this update by clicking 'ABOUT PHONE > SYSTEM UPDATES.