మారుతి సుజుకి నుండి కొత్త ఎస్ యు వీ

Maruti Suzuki To Launch New Vitara In India

04:15 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Maruti Suzuki To Launch New  Vitara In India

భారతీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ఒక కొత్త కారును ప్రవేశపెట్టనుంది. ఇటివల మారుతీ సుజుకి కంపెనీ వారి నుండి వచ్చిన బలెనో కార్లు మంచి విజయం సాధించింది. అదే జోరుతో ఇంకో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. రోజురోజుకు ఎస్ యు వి మోడల్ కార్లకు మార్కెట్లో ఆదరణ పెరుగుతుండడంతో మారుతి సుజుకి వారు " విటారా" పేరు తో ఒక కొత్త ఎస్ యు వి మోడల్ కార్ ను విడుదల చేయనుంది. మారుతీ సుజుకి వారి కంపెనీ నుండి ఇంతకు ముందు వచ్చిన విటారా కార్ కు అప్ గ్రేడ్ మోడల్ గా ఈ కారును విడుదల చెయ్యనున్నారు. ఈ కొత్త వెర్షన్ లో 6 స్పీడ్ గేర్ సిస్టం, 1.3 లీటర్ల డీజిల్ ఇంజిన్ మరియు 1.6 లీటర్ల డీజిల్ ఇంజిన్ల తో విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఈ కారు తాలుకు ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ కారు హ్యుండై క్రిటా, హోండా సిఅర్-వి వంటి ఎస్ యు వి కార్లకు గట్టి పోటినిస్తుందని తెలిపారు. 2016 లో జరగబోయి ఆటో ఎక్స్ పో లో ఈ కారును ప్రదర్సించనున్నట్లు సమాచారం.

English summary

India,s Largest Cars Company Maruti Suzuki Is going to launch its new car called "Vitara" in 2016. The Stills are being attracted by the car lovers. Cars Comes with a Great Sportive Look. It is Likely to be surprised in Auto Expo 2016