భారత్ కు పెను భూకంప ముప్పు?

Massive 8-magnitude earthquakes could hit India

06:11 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Massive 8-magnitude earthquakes could hit India

భారతదేశానికి పెను భూకంప ముప్పు పొంచి ఉందా.. 8 అంతకంటే ఎక్కువ తీవ్రతతో పెను భూకంపం సంభవించే అవకాశం ఉందా.. ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి కేంద్ర హోం శాఖ వర్గాలు. ఉత్తర, ఈశాన్య భారత్ లో రిక్టర్ స్కేలుపై 8 అంతకంటే ఎక్కవ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశాలున్నాయిని శాఖలోని విపత్తు నిర్వహణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని హిమాలయ ప్రాంతం పెను భూకంపం ముప్పు అంచున ఉందని పేర్కొంటున్నారు. మణిపూర్ లో మొన్న సంభవించిన భూకంపం భవిష్యత్ లో ఈ ప్రాంతంలో మరింత తీవ్రతతో పెను భూకంపం సంభవిస్తుందనడానికి సూచనగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల వరుసగా సంభవించిన భూకంపాల కారణంగా హిమాలయ ప్రాంతంలోని భూమి అంతర్భాగంలోని టెక్టోనిక్ ప్లేట్ల స్థితిగతులు మారిపోయాయి పగుళ్లు ఏర్పడ్డాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ పగుళ్ల కారణంగా భారత్ కు మరీ ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో పెను భూకంప ముప్పు పొంచి ఉందని ఆ నివేదిక వివరించింది. నేపాల్, భూటాన్, మయన్మార్, భారత్ లలో పెను భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపింది. పలువురు అంతర్జాతీయ భూకంప నిపుణులు కూడా రాబోయే భూకంపం గురించి హెచ్చరిస్తున్నారు.

English summary

Ministry Of Home Affairs experts have warned that earthquakes with a magnitude of 8.0 or more on the Richter scale are likely to hit the Himalayan region