చైనాలొ మావో గోల్డెన్ స్టాట్యూ..

Massive Statue of Mao Zedong

07:06 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Massive Statue of Mao Zedong

చైనాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. మరణించిన 40 ఏళ్ల తర్వాత చైనాలోని ఓ మారుమూలు గ్రామంలో ఆయన భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. 36 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు రూ.మూడు కోట్ల పైనే ఖర్చు కానుంది. ఈ విగ్రహాన్ని స్టీల్, కాంక్రీట్ లతో నిర్మించి బంగారు రంగు వేశారు. ఈ గోల్డెన్‌ స్టాట్యూను హెనన్‌ ప్రావిన్స్ లోని కైఫెంగ్ సమీపంలో ఏర్పాటు చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన మావో విగ్రహాన్ని స్థాపించేందుకు గ్రామస్తులు కూడా విరాళాలు సేకరించారు. మావో విగ్రహాన్ని పేద కళకారులు తయారు చేయడం విశేషం. 1893 డిసెంబర్‌ 26న జన్మించిన మావో.. సెప్టెంబర్‌ 9, 1976లో మృతిచెందారు. దేశ నలుమూలల నుంచి వస్తున్న ప్రజలు మావో విగ్రహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది.

English summary

A new photo shows construction of a new statue of Mao Zedong in China’s Tongxu County on Monday, depicting a grand scale project that appears to be nearly at completion.