ఆ సైట్  హ్యాక్ -  27మిలియన్ల ఖాతాల చోరీ

Mate One Online Dating WebSite Hacked

03:38 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Mate One Online Dating WebSite Hacked

చోరీలు , దొంగతనాలు బయటే కాకుండా నెట్ లో కూడా విస్తృతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రముఖ డేటింగ్‌ వెబ్‌సైట్‌ మేట్‌1.కామ్‌కి సంబంధించిన వినియోగదారుల ఖాతాలు హ్యాకింగ్‌కి గురయ్యాయి. 27మిలియన్ల ఖాతాలకు సంబంధించిన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, ఈ-మెయిల్‌ చిరునామాలను ఓ హ్యకర్‌ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసాడు. మదర్‌బోర్డ్‌వైస్‌ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. మేట్‌1.కామ్‌కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 31.5 మిలియన్ల ఖాతాదారులను కలిగి ఉంది. వెబ్‌సైట్‌ మైఎస్‌క్యూఎల్‌ సర్వర్‌లోని లోపం ఆధారంగా కొన్ని కమాండ్‌లతో ప్రవేశించినట్లు హ్యాకర్‌ పేర్కొన్నాడు. మొత్తం 40మిలియన్ల అకౌంట్లను చోరీ చేయగా అందులో చాలా నిరుపయోగంగా ఉన్నాయి. మేట్‌వన్‌లో సైన్‌ అప్‌ చేసే సమయంలో ఎలాంటి ఈ-మెయిల్‌ వెరిఫికేషన్‌ లేకపోవడంతో ఎవరైనా సులువుగా ఈ ఖాతాను తెరిచే అవకాశం ఉంది. తమది కాని, ఉపయోగంలో లేని ఈ-మెయిల్‌ ఐడీలను ఉపయోగిస్తూ ఖాతాలను తెరుస్తున్నారని తెలిపాడు. చోరీకి గురైన ఖాతాల్లో చాలా మంది జీమెయిల్‌ ఐడీలను ఉపయోగించారు. మేట్‌వన్‌ పాస్‌వర్డ్‌ల నిల్వకోసం ఎటువంటి ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం కల్పించలేదు. మీరు పాస్‌వర్డ్‌ మర్చిపోతే ఏ మెయిల్‌ ఐడీకి పంపించాలో తెలియజేస్తే చాలు, దానికి సాధారణ సమాచార రూపంలో పాస్‌వర్డ్‌ను మెయిల్‌ చేస్తుంది. దీంతో హ్యాకర్‌ చోరీ చేసిన సమాచారాన్ని 8,600 డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. అయితే అది చివరికి ఎంతకు అమ్ముడైంది తెలియరాలేదు. దొంగిలించిన డేటాతో వినియోగదారులకు చెందిన వేర్వేరు సర్వీసుల్లో ఇవే యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను వాడి ఉండవచ్చని దీంతో వారి వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సంబంధిత సమాచారానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాంకేతిక పెరిగే కొద్దీ, ప్రజలకు సౌకర్యాలు అందడం మాట ఎలా వున్నా , చోరీల బెడద అందరినీ కుదిపేస్తోంది. ఇక సైబర్ నేరాలు కూడా విపరీతమవుతున్నాయి.

English summary

Hackers Have hacked the most popular online dating website Mate1.com.Hackers have hacked almost 27 million accounts and the hackers have put them for sale for 8600 dollars.