బ్రదర్స్ సిస్టర్స్ అయిన వేళ ’!

Matrix Producers Changed Their Genders

10:43 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Matrix Producers Changed Their Genders

నిన్నటి దాకా వాళ్ళు బ్రదర్స్ .. అయితే ఒక్కసారిగా, సిస్టర్స్ గా మారిపోయారు వారెవరో కాదు. 'మ్యాట్రిక్స్‌’ సిరీస్‌ చిత్ర నిర్మాతలయిన వచోవ్‌స్కీ బ్రదర్స్... వాళ్ళనే మనం ఇకపై ‘సోదరీమణులు’ అని అనాల్సిందే. అదెలా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. వీళ్ళిద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నారు. ఇందులో ఒకరైన ల్యారీ వచోవ్‌స్కీ, 2012లోనే తాను ‘ట్రాన్స్‌జెండర్‌’నని, ఇకపై తన పేరు ‘లానా’ అవుతుందని ప్రకటిం(చారు)చింది. ఇప్పుడు ఆ జంటలో మిగిలిన రెండో బ్రదర్‌ యాండీ వచోప్‌స్కీ కూడా తానూ ‘ట్రాన్స్‌జెండర్‌’నేనని ప్రకటించారు. ఈయన కొత్తగా ‘లిల్లీ’గా వ్యవహారంలో కి వచ్చారు. ల్యారీకి ‘లానా’గా మారిన నాలుగేళ్లకు తమ్ముడు కూడా ఆడ గా మారిపోవడం నిజంగా విశేషమే. ఈ జంటలో ఒకప్పటి అన్నగారికి 50 ఏళ్లు, తమ్ముడిగారికి 48 ఏళ్లు. వీరు ఇద్దరూ కలిసి ‘క్లౌడ్‌ అట్లాస్‌’, ‘జూపిటర్‌ ఎసెండింగ్‌’, ‘వి ఫర్‌ వెండెట్టా’ అనే చిత్రాలకు పని చేశారు. అయితే, కీనూ రీవ్స్‌ నటించిన ‘మ్యాట్రిక్స్‌’ సిరీస్‌ చిత్రాలు మూడింటినీ వీరు నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా బాక్స్‌ఆఫీస్‌ను కొల్లగొట్టి, దాదాపు 1500 కోట్ల డాలర్లను మూటగట్టుకున్నారు. చాలా చిత్రాలకు కోడైరెక్టర్‌గా పనిచేసిన యాండీ ఇప్పుడు ‘ఆడ’గా రూపాంతరం చెందటంతో, అమెరికాలోని ‘ట్రాన్స్‌జెండర్‌’ మనుషులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య లింగ మార్పిడి కేసులు ఎక్కువగానే కనిపిస్తునాయి. మోజు వుంటే ఏదైనా సాధ్యమేగా. సృష్టికి ప్రతి సృష్టి ఇదేనేమో ....

English summary

Matrix Director Larry Wachowski Undergoes Sex Change and Announces New Name Lana In Cloud Atlas Preview Trailer.The Wachowski Brothers," has changed his name from "Larry" to "Lana" after undergoing a sex change operation.