మాథ్యూ హరికేన్ దెబ్బకు వణుకుతున్న అమెరికా!

Matthew Hurricane in America

04:04 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Matthew Hurricane in America

ప్రకృతి ప్రళయం సృష్టిస్తే ఆపడం ఎవరి తరం కాదు. అది అగ్రరాజ్యమైనా మరొకటి అయినా ఒకటే. ఇదిగో ఇప్పుడు పెనుతుపాను మాథ్యూ దెబ్బకు అమెరికాలోని ఫ్లోరిడా చిగురుటాకులా వణికిపోతోంది. హైతీలో మాథ్యూ హరికేన్ వల్ల ఇప్పటికే 283 మంది ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా భయపడుతోంది. ఈ పెనుతుపాను ఇప్పుడు ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో అగ్రరాజ్యం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పటికే ఫ్లోరిడా, జార్జియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. హరికేన్.. పెనుగాలులు, భారీ వర్షాలతో బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మ్యాథ్యూ హరికేన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ ప్రమాదక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతున్నారు. పెను తుపాను మనుషులను చంపేస్తుంది, చాలా సీరియస్, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇది నాలుగో కేటగిరీ హరికేన్ అని అధికారులు తెలిపారు. దశాబ్ధ కాలంలో కరేబియన్ ప్రాంతంలో సంభవించిన తుఫానుల్లో ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు చెప్తున్నారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.. మాథ్యూ తీవ్రతను తెలియజేస్తూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దాదాపు 25లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు.

1/5 Pages

అపార నష్టం...


హైతీలో ఈ పెనుతుపాను తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించింది. జెరెమీ నగరంలో దాదాపు 30వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోచ్ ఎ బాట్యూ నగరంలోనే 50 మంది చనిపోయారు. ఈ తుపాను ప్రభావం హైతీ, క్యూబాలతో పాటు బహమాస్ పై కూడా పడింది. భారీ వేగంతో వీచే గాలుల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అయితే ప్రాణనష్టం ఎక్కువగా హైతీలోనే జరిగింది. తీరప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్, టెలిఫోన్, రవాణా వ్యవస్థలు దెబ్బతినడంతో పాటు ఆహారం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

English summary

Matthew Hurricane in America