‘మజర్ బాట్’ అలర్ట్‌

Mazar BOT Malware Could Wipe Your Android Phone

04:18 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Mazar BOT Malware Could Wipe Your Android Phone

మజర్ బాట్.. ఇప్పుడు మొబైల్ ఫోన్లలో వేగంగా విస్తరిస్తున్న మాల్ వేర్. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్‌ ఎస్‌ఎంఎస్‌/ఎంఎంఎస్‌ల రూపంలో ఆండ్రాయిడ్ స్మార్ట ఫోన్లు, ట్యాబ్లెట్లలోకి విస్తరిస్తోంది. ఆండ్రాయిడ్‌ డివైస్ల్ లు వాడే వినియోగదారులు వెబ్‌సైట్‌ల నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌లు/ఎంఎంఎస్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యాకు చెందిన హ్యాకర్లు.. ఈ మాల్‌వేర్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా వెబ్‌లింక్‌లను పంపిస్తున్నట్లు డెన్మార్క్‌లోని హెమ్‌డల్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఆ లింకులను ఒక్కసారి క్లిక్‌ చేస్తే.. ఫోన్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లడంతో పాటు.. ఫోన్‌లోని ఫైళ్లన్నీ పూర్తిగా తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే.. వినియోగదారులు చేసే ప్రతి పనినీ హ్యాకర్లు పరిశీలిస్తూ ఈ మెయిల్‌.. సోషల్‌ మీడియా లాగిన్‌ వివరాలు.. బ్యాంకు లావాదేవీల వంటి సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మాల్‌వేర్‌ను రష్యాకు చెందిన హ్యాకర్లు పంపిస్తున్నారని కొందరు సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అయితే రష్యాలోని ఫోన్లకు మాత్రం అది ఎలాంటి హాని చేయదని అంటున్నారు. సో.. ఏదేమైనా అనుమానాస్పద వెబ్‌సైట్‌ నుంచి వచ్చిన లింకులను క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం మంచిది.

English summary

Heimdal Security has recently analyzed a text message sent to random mobile numbers. The Geographical extent is so far unknown, so please exercise caution.If the APK (which is a program file for Android) is run on an Android-powered smartphone, then it will gain administrator rights on the victim’s device.