ఎన్టీఆర్‌ జనతాగ్యారేజ్‌ కోసం

Mechanic shed set for NTR movie janata garage

01:54 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Mechanic shed set for NTR movie janata garage

ప్రస్తుతం “ నాన్నకు ప్రేమతో ” చిత్రంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ తరువాతి చిత్రం “ జనతా గ్యారేజ్‌ ” ఈ విషయం అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కోసం భారీ మెకానిక్‌ షెడ్‌ సెట్‌ వేయనున్నారు. ఈ సెట్‌ కోసం సారధి స్టూడియోలో ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ ఎస్‌ ప్రకాష్‌ పర్యవేక్షణలో ఓ భారీ మెకానిక్‌ షెడ్‌ దానితో పాటు చుట్టుపక్కల షాప్‌ల సెట్టింగ్‌లు కూడా వేస్తున్నారు. ఈ భారీ సెట్టింగ్‌ వేయడానికి దాదాపు రెండు వారాలు పడుతుందట. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యమీనన్‌ హీరోయిన్‌లుగా నటించనున్నారు. ఈ చిత్రం నవంబర్‌ లో పూజా కార్యక్రమాలు జరుపుకుని, ఫిబ్రవరి రెండో వారం నుండి రెగ్యూలర్‌ ఘాటింగ్‌ మొదలు కానుంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న జనతా గ్యారేజ్‌ కి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

English summary

Mechanic shed set for NTR movie janata garage.