కాపు మీడియా రాబోతోందా..!

Media for Kapu caste

01:43 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Media for Kapu caste

మీడియా అంటే ఇప్పుడు అదో పెద్ద అసెట్ గా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు... నిజానికి సామాన్య ప్రజలకన్నా రాజకీయ నేతలకే ఎక్కువ అవసరం. అందుకే ఇబ్బడిముబ్బడిగా మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ర్టాల్లో అన్ని రాజకీయ పార్టీలకు మీడియా సపోర్ట్ చాలా అవసరం. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మీడియా జనాలకు చేరవేయడంలో ముందుండే మన తెలుగు మీడియా సంస్థలు తాము మద్దతు ఇచ్చే పార్టీలకు అనుగుణంగా డప్పు వాయించడంలోను తెలుగు మీడియా సంస్థలు జాతీయ మీడియా సంస్థలకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివాయని చెప్పవచ్చు.

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక ఏపీలో అధికార టీడీపీకి సపోర్ట్ చేసేందుకు చాలా మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి. మీడియా మేనేజ్ మెంట్లో టీడీపీదే పూర్తి డామినేషన్. ఇక విపక్ష నేత జగన్ కు సైతం సాక్షి సొంత మీడియా ఉండనే ఉంది. ఇలా సామాజికవర్గాల వారీగా, పార్టీల పరంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎవరికి వారికే సొంత, అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో కాపు ఉద్యమం తెరమీదకు వచ్చింది. దీంతో కాపుల ప్రయోజనాల కోసం వారికంటూ సొంతంగా మీడియా ఉండాలన్న అంశం కాపు పెద్దల్లో చర్చకు వచ్చిందని అంటున్నారు..

ప్రస్తుతం కాపులు రిజర్వేషన్లతో పాటు అధికార సాధన దిశగా దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు ఉద్యమం మీడియాలో హైలెట్ కావడం లేదని భావిస్తున్న కాపు పెద్దలు తమకోసం తమ వర్గం ఆధీనంలో ఉండేలా అర్జెంటుగా మీడియా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో దాసరి నారాయణరావు ఉదయం పేపర్ పెట్టినా దాన్ని నడపలేకపోయారు. తర్వాత మాజీ మంత్రి, ప్రస్తుత వైస్పి నేత బొత్స సత్యనారాయణ ఓ ఛానెల్ ను లీజుకు తీసుకుని నడిపినా తర్వాత ఆయన కూడా చేతులెత్తేశారు.
ఇక గతంలో చిరు ఓ పారిశ్రామికవేత్తతో కలిసి ఓ ఛానెల్ ను లాంచ్ చేసే ప్రయత్నాలు జరిగాయి.

అది చివరి వరకు వచ్చిన టైంలో వెనక్కి పోయింది. తాజాగా కాపు ఉద్యమం నేపథ్యంలో నిన్న పార్క్ హయత్ హోటల్లో జరిగిన కాపు పెద్దల సమావేశంలో కాపు మీడియా అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలుగు రాష్ర్టాల్లో చాలా బడా బడా మీడియా సంస్థలు ఉన్న నేపథ్యంలో కాపు వర్గం వాళ్లు సొంత మీడియాతో వస్తే వారు ఎంత వరకు సక్సెస్ అవుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..

English summary

Media for Kapu caste