'మీడియా లాకర్'తో ఫొటోలు, వీడియోలు సేఫ్

Media Locker App That Protects Our Files

05:33 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Media Locker App That Protects Our Files

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే అందంగా కనిపించిన ప్రతి దానిని ఫొటో లేదా వీడియో తీయడం చాలామందికి అలవాటే.. మరికొందరు ఆన్ లైన్ లో తమకు నచ్చిన వీడియోలను డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఫొటో గ్యాలరీలోనే మనకు కనిపిస్తాయి. మనం పర్సనల్ గా ఫోన్‌ను ఉపయోగిస్తే వీటితో వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా మన ఫోన్ తీసుకుని దాంట్లోని గ్యాలరీని చూస్తే చాలామంది ఇబ్బందిగా ఫీలవుతారు. ఇలాంటి సందర్భాల నుంచి బయటపడేందుకు మీడియా లాకర్ అనే ఆండ్రాయిడ్ యాప్ కొత్తగా విడుదలైంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ డివైస్‌లోని ముఖ్యమైన ఫొటోలు, వీడియోలను ఇతరులు చూడకుండా లాక్ చేసుకోవచ్చు. ఇందు కోసం పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ ద్వారా లాక్‌ను సెట్ చేసుకోవచ్చు. డివైస్ మెమోరీలో ఉన్న ఆయా ఫొటోలు, వీడియోలను వివిధ రకాల ఫోల్డర్లలో మనకు అనుకూలంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వీటిని కావాలనుకున్నప్పుడు వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు. డివైస్‌లోని jpg, wmv, avi, mov, 3gp, Divx వంటి వివిధ రకాల ఫైల్ ఫార్మాట్లను ఈ యాప్ ద్వారా లాక్ చేసుకోవచ్చు. యూజర్ తాను క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్‌ను మరిచిపోయినా సులభంగా దాన్ని రికవరీ చేసుకునే వీలుంది. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary

A new smart phone app has been launched named Media locker which protects our photos and videos.We can set psassword or pattern and then we can hide our files in that app