మీడియాటెక్ తో జర భద్రం..

MediaTek Acknowledges Security Bug

10:58 AM ON 4th February, 2016 By Mirchi Vilas

MediaTek Acknowledges Security Bug

ప్రస్తుతం నడుస్తోంది స్మార్ట్ యుగం. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం చవక ధరకే ఆండ్రాయిడ్ మొబైల్స్ అందుబాటులోకి రావడం. అయితే ఇలాంటి మొబైల్స్ లో ఎక్కువగా వాడుతున్న ప్రాసెసర్ మీడియా టెక్ కంపెనీకి చెందినదే. అందులోనూ ఎక్కువ మొబైల్స్ లో ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ వెర్షనే ఉంటోంది. అయితే ఈ ప్రాసెసర్.. ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంటే మీ మొబైల్ కు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నట్లేనట. ఈ విషయాన్ని సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థలే కాదు.. సాక్షాత్తూ మీడియాటెక్ సంస్థ కూడా ధ్రువీకరిస్తోంది. మీడియాటెక్ ప్రాసెసర్ కలిగిన ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ డివైస్‌లలో వచ్చిన ఈ లోపం (సాఫ్ట్‌వేర్ బగ్) సదరు డివైస్‌ను రూట్ చేయడం (అడ్మిన్ హక్కులు పొందడం) ద్వారా అటాకర్‌కు సులువుగా దాడి చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంది. రూటింగ్ వల్ల అటాకర్ డివైస్‌లోని డేటాను, ఇతర సమాచారాన్ని తస్కరించడంతోపాటు ఫోన్‌ను బ్రిక్ (పనిచేయకుండా చేయడం) చేసేందుకు అవకాశం ఉంది. తాజాగా తెరపైకి వచ్చిన ఈ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే విషయంపై మీడియాటెక్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. మొబైల్ తయారీ సంస్థలు మొదట్లోనే ఈ లోపాన్ని గుర్తించి సవరిస్తే దాన్ని వాడే యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదట.

English summary

Samrt Phone Chip maker Media Tek was faced a ne problem.Recent rumors reported that MediaTek-powered devices which are running KitKat may be exposed to attacks due to a bug, and MediaTek confirmed this fact