హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వికటించి..విద్యార్ధి దుర్మరణం(వీడియో)

Medical student died for taking hair transplantation treatment

10:34 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Medical student died for taking hair transplantation treatment

ఒక్కోసారి టైం బాగోకపోతే, ఏదైనా వికటిస్తుంది. అది వైద్యమైనా, మరొకటి అయినా సరే అంతే.. ఇప్పుడు ఆలాంటిదే ఒకటి వికటించింది. ఏకంగా ప్రాణాలే పోయాయి. సకల హంగులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న చెన్నై మహా నగరంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చేసిన ఓ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వికటించి ఓ వైద్య విద్యార్థి దుర్మరణం చెందాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చెన్నైలో అడ్వాన్స్ డ్ రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్ పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ సెంటర్ కు ప్రభుత్వ అనుమతి లేదు.

హెయిర్ సెలూన్ పేరిట తీసుకున్న అనుమతి కాల పరిమితి కూడా ఇటీవలే ముగిసింది. అయినా సదరు సెంటర్ నిర్వాహకులు యథేచ్ఛగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కాస్తంత బట్ట తల వచ్చిన ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న మెడికో సంతోష్ ఇటీవలే అక్కడికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి వెళ్లాడు. దాదాపు 10 గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన సదరు సెంటర్ నిర్వాహకులు.. సంతోష్ తల పై 1,200 రోమాలను అమర్చారు. ఇందుకోసం సంతోష్ దాదాపు 73 వేల రూపాయలు వెచ్చించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన సంతోష్ కు జ్వరం రావడంతో, మామూలు జ్వరమే అని తల్లిదండ్రులు అనుకున్నారు.

ఇంతలోనే పడుకున్న మంచం మీదే సంతోష్ ప్రాణాలు వదిలాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మరణించాడని సంతోష్ తల్లి జోస్ బెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెంటర్ ను సీజ్ చేసి కేసు పై దర్యాప్తు చేస్తున్నారు. కొన్నింటికి అతిగా స్పందిస్తే, ఇలానే ప్రమాదం ముంచుకొస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary

Medical student died for taking hair transplantation treatment