ఎవరైనా కోపంతో అరిస్తే ... వెంటనే వారి నోట్లో చక్కెర వేయండి

medicine to control anger

11:31 AM ON 31st January, 2017 By Mirchi Vilas

medicine to control anger

మనిషి ఎంత గొప్పవాడైనా సరే, కొన్ని అవలక్షణాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అందులో ముఖ్యంగా కోపం అనేది చాలా మందికి సహజ సిద్ధంగా వచ్చేస్తుంది. కొందరికి పట్టరానంత కోపం వస్తే కొందరికి వచ్చే కోపం సాధారణంగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా వారు అణచుకుంటారు. కానీ ఇంకా కొందరు ఉంటారు… అలాంటి వారికి కోపం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియదు. తిడతారు లేదంటే కొడతారు. ఇంకొందరు తమ దగ్గర అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు. ఈ క్రమంలో అలాంటి వారికి వచ్చే కోపం ఓ పట్టాన తగ్గదు. దీంతో వారిని చూసే వారికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే అందుకు ఓ పరిష్కారం ఉందంట. అదేమిటంటే,

ఎవరికైనా పట్ట రానంత కోపం వస్తే వెంటనే వారి నోట్లో కాస్తంత చక్కెర పోయాలట. దీంతో వారి కోపం ఇట్టే తగ్గిపోతుందట. ఇది తమాషా కాదండోయ్. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలిన నిజం. ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పలువురు పరిశోధకులు చక్కెరకు, కోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇటీవలే కనుగొన్నారు. అదేమిటంటే… ఎవరికైనా కోపం వచ్చినప్పుడు దాన్ని అణచుకోవాలంటే వారికి అధిక మొత్తంలో శక్తి కావల్సి వస్తుందట. అందుకు శరీరంలో గ్లూకోజ్ బాగా అవసరం అవుతుంది.

ఈ క్రమంలో అలా శరీరానికి గ్లూకోజ్ ఇచ్చేందుకు చక్కెర తినాలి. చక్కెరలో బాగా క్యాలరీలు, గ్లూకోజ్ ఉంటాయి కదా. అవి వెంటనే శరీరంలో చేరి ఆ వ్యక్తికి కావల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో వారి కోపం ఇట్టే తగ్గుతుందట. దీన్ని పైన చెప్పిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అయితే చక్కెర అందుబాటులో లేకపోతే చక్కెర కలిపిన పానీయం లేదా చక్కెర కలిపిన నిమ్మకాయ నీళ్లు వంటివి తాగవచ్చట. అలా చేసినా కోపం అదుపులోకి వస్తుందట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఇంట్లో కానీ , మీకు తెలుసున్నవాళ్లకు కానీ కోపం వస్తే, ఈ ప్రయోగం చేయండి.

ఇది కూడా చూడండి: టైగర్ ని ఓ ఆట ఆడించిన బాతు(వీడియో)

ఇది కూడా చూడండి: ఇదో రకం జల్లికట్టు ... దేంతోనే తెలుసా ?

English summary

now it is easy to stop anybody's anger with some sugar. scientists prove that if you place some sugar in angry people it gets decreases.