‘మీకు మీరే మాకు మేమే’ టీజర్

Meeku Meere Maaku Meme Teaser

10:25 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Meeku Meere Maaku Meme Teaser

తరుణ్‌ శెట్టి, అవంతిక, కిరీటి దామరాజు, జెన్ని, భరణ్‌ కీలక పాత్రధారులుగా హుస్సేన్ షా కిరణ్‌ దర్శకత్వంలో, నకమా ప్లానెట్‌ గ్రీన్ స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న ‘మీకు మీరే మాకు మేమే’ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య వినయ్‌, సంగీతం: శ్రవణ్‌, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్. గ్జిక్యూటివ్‌ నిర్మాత: కార్తీక్‌ వంశీ తాడేపల్లి

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా సినిమా యూనిట్‌లో చాలా మంది ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వాళ్ళమే. షార్ట్‌ ఫిలిమ్స్‌తో మా జర్నీని మొదలుపెట్టి చలనచిత్రం తీసే స్థాయికి వచ్చాం. నాకు ‘మిస్సమ్మ’ సినిమా అంటే ఇష్టం. అందులోని ఓ సీన్‌‌ నుండి ఇనస్పైర్‌ అయ్యి ఈ చిత్రాన్ని చేశా. ఆ సినిమాకు గౌరవమిస్తూ అందులోని పాట పల్లవితో ఈ టైటిల్‌ని పెట్టాం. చక్కటి ప్రేమ కథను క్యారీ చేశాం. సినిమాతో పాటే ప్రేక్షకులు కూడా ట్రావెల్‌ చేస్తారు. ప్రేమ ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చెప్పడానికి మా ప్రయత్నం చేశాం. ఇది కాంప్లెక్స్‌ లవ్‌స్టోరీ గా కాకుండా ఇద్దరు కాంప్లికేటెడ్‌ వ్యక్తుల మధ్య నడిచే ప్రేమకథ గా తీసాం. అన్ని వర్గాలను ఆకట్టు కొంటుందని ఆశిస్తున్నాం' అని వివరించారు.

English summary