మహేష్ తో సినిమా కోసం మీనా తహతహ

Meena Waiting To Produce Mahesh babu Movie

03:21 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Meena Waiting To Produce Mahesh babu Movie

కొన్ని న్యూస్ లు షాక్ ఇస్తాయి. మరికొన్ని కిక్కు ఇస్తాయి.. అయితే ఈ న్యూస్ తో షాక్ అవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే, మీరు అనుకుంటున్నట్లేమీ కాదు. ఒక్కప్పుడు యువత మదిలో గిలిగింతలు పెట్టిన ఈ అమ్మడు దృశ్యం సినిమాలో కూడా వెంకీ సరసన గ్లామర్ తో అదర గొట్టేసింది కూడా .. మరి ఇప్పుడు ప్లాన్ ఏమిటంటే, మహేష్ బాబుతో సినిమా తీయాలని మీనా తహతహలాడుతోంది. అవును సినీ నిర్మాణంలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరు తోంది. అందుకు తెలుగు - తమిళ ఇండస్ర్టీలను వేదికగా చేసుకోవాలని అనుకుంటోంది. అయితే చిన్నాచితకా సినిమాలు కాకుండా భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు కొట్టాలన్నది మీనా ప్లానట. అందుకోసం తెలుగు - తమిళ ఇండస్ట్రీల్లో ఆమె కొందరు కథానాయకులతో సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారట. తెలుగు విషయానికొస్తే తిరుగులేని ఇమేజ్ ఉన్న మహేష్ తో సినిమా తీయాలని మీనా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ.. మహేష్ ఒప్పుకొన్న ప్రాజెక్టులను చూస్తుంటే ఇప్పుడిప్పుడే మీనా కల నెరవేరేలా కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ప్రస్తుతం మహేష్ నటించిన బ్రహ్మోత్సవం విడుదలైంది. ఆ తరువాత మురుగుదాస్ సినిమా స్క్రీనింగ్ లో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ - పూరీ జగన్నాథ్ కూడా మహేష్ తో సినిమా తీసేందుకు క్యూలో నిల్చున్నారు. ఇలాంటి సమయంలో మీనాకు మహేష్ కాల్షీట్లు దొరుకుతాయా అన్నది ప్రశ్నే. అయితే.. మహేష్ తో సినిమా కోసం రెడీగా ఉన్న డైరెక్టర్లను ఒప్పించగలిగి తన నిర్మాణంలో సినిమా ప్లాన్ చేస్తే మీనా అనుకున్నది సాధించినట్లే. మరోవైపు తమిళంలో కమల్ హాసన్ తో తన మొదటి సినిమా నిర్మించాలని మీనా అనుకుంటోందట. అక్కడ ఆమె అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి ప్రిన్స్ తో సినిమాల కోసం క్యూ కట్టేవారి సంఖ్య పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

ఇవి కూడా చదవండి:చరణ్ తో రామ్ కి గొడవా ?

English summary

Versatile actress meena wants to do produce Mahesh Babu movie. She was planning to produce movies in both Telugu and Tamil and she decided to do movie with mahesh babu in Telugu.