పవన్ కళ్యాణ్ తో రెండు రోజులు గెస్ట్ హౌస్ లో ఉందట!

Meera Chopra shocking comments about Pawan Kalyan

06:02 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Meera Chopra shocking comments about Pawan Kalyan

2006లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో పవన్ సరసన నటించిన మీరా చోప్రా తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకి ఆ కామెంట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 'బంగారం' చిత్రం షూటింగ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ వచ్చి షూటింగ్ కి ఇబ్బంది కలిగిస్తారేమో అనే భయంతో ఈ సినిమా డైరెక్టర్ తమిళనాడులోని పొల్లాచ్చిలో 'బంగారం' సినిమా షూటింగ్ ప్లాన్ చేసారట. అక్కడ హోటల్స్ ఉండవు కాబట్టి, సినిమా షూటింగ్ అయ్యేంత వరకు చిత్ర యూనిట్ మొత్తం అక్కడున్న ఒక గెస్ట్ హౌస్ లోనే ఉన్నారట.

అయితే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుందని తెలుసుకున్న అక్కడ చుట్టూ ప్రక్కల గ్రామాల వాళ్ళు పవన్ కళ్యాణ్ ని చూడటానికి ఒక 10, 20 వేల మంది దాకా వచ్చారట. దీనితో పవన్ కళ్యాణ్ కి అడుగు బయట పెట్టడానికి కూడా కష్టంగా ఉండేదట. అయితే పవన్ కళ్యాణ్ బయటకి రాకుండా గెస్ట్ హౌస్ లో ఉండి ఉంటే, ఇందులో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా కూడా బయటకి రాకుండా అదే గెస్ట్ హౌస్ లోనే ఉంటారుగా.. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అంటే తన అభిమానులకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో తన మాటల్లో చెప్పింది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చెయ్యడమంటే చాలా కష్టం, ఆయన అభిమానులతో అస్సలు తట్టుకోలేము, ఇతర దేశాలకి వెళ్లి షూటింగ్ చేసుకు రావాల్సిందే అని మీరా చోప్రా చెప్పింది.

నేను న్యూయార్క్ లో పెరిగాను, ఇండియాలో హీరోలను దేవుళ్ళుగా చూస్తారని విన్నాను, బంగారం షూటింగ్ కోసం నేను సౌత్ కి వచ్చినప్పుడు అది కళ్ళారా చూసాను. సో పవన్ కి ఫాన్స్ లేరు భక్తులే ఉంటారని ఇప్పటికైనా రుజువైందిగా..

English summary

Meera Chopra shocking comments about Pawan Kalyan