తారాస్థాయికి చేరిన మెగా అభిమానం

Mega Fanism at peaks

10:34 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Mega Fanism at peaks

హీరోలకు అభిమానులు ఉండడం సహజం. అయితే కొందరు అభిమానులకు పిచ్చ అభిమానం ఉంటుంది. తారాస్థాయికి అభిమానం చేరితే ఎవరు చెప్పినా వినరు. తాము అందుకున్నది తమ హీరోకు చేసేస్తారు. మరికొందరు తమ అభిమాన హీరోల కోసం ఆస్తులను తగలేసుకున్నవాళ్లూ వున్నారు. ఇక అభిమానం పీక్స్ కి చేరడమంటే ఇదేనేమో అనిపించేలా ఈ ఘటన తెలుపుతోంది. చికెన్ 65 - మటన్ 45 అని కనిపించాల్సిన హోటల్ లో చిరు -150 అని కనిపిస్తోంది. ఆంజనేయ ట్రావెల్సో - శ్రీనివాస సర్వీసో అని కనిపించాల్సిన లారీ నేమ్ ప్లేట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని దర్శనమిస్తోంది.

1/3 Pages

అభిమానానికి పీక్స్ అంటే ఇంతకంటే ఉదాహరణ ఏమని చెప్పాలి. స్వయంకృషితో ఎదిగి, భారతదేశంలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొన్న స్టార్లలో చిరంజీవి ఒకరు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల అశేష అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆంధ్ర - సీడెడ్ - నైజామ్ ఎటువెళ్లినా మెగా నామస్మరణమే. చిరు వారసులొచ్చాక ఆ అభిమానాన్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తూ, దశదిశలా వ్యాపింపజేశారు. తమ్ముడు పవన్ కి నేషనల్ వైడ్ గా అభిమానులున్నారు. రాజకీయ రంగంలోనూ పవన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అల్లుడు అల్లు అర్జున్ కేరళ ప్రజలకి మల్లు అర్జున్ అయ్యాడు.

English summary

Mega Fanism at peaks