చంద్రబాబుపై మెగా అభిమానుల భగ్గు భగ్గు

Mega Fans are very angry with Chandrababu

11:27 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

Mega Fans are very angry with Chandrababu

ఎపి సీఎం చంద్రబాబుపై మెగాస్టార్ అభిమానులు భగ్గుమన్నారు. సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశకు తరలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్భాలు పలికారని అయితే, చిరంజీవి నటించిన ఖైదీనెంబరు 150 కొత్త చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలకు విజయవాడ నగరంలో అనుమతి ఇవ్వకుండా సినీ పరిశ్రమను అవమానిస్తున్నారని చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు ఫైర్ అయ్యారు. చిరంజీవి 150వ చిత్రం ఫ్రీ రిలిజ్ ఫంక్షన్ వేడుకలకు ముఖ్యమంత్రి విజయవాడలో అనుమతి ఇవ్వనందుకు నిరసనగా శనివారం సాయంత్రం చిరంజీవి అభిమానుల సంఘ నాయకులు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చిరంజీవి నటించిన ఖైదీ నెంబరు 150 చిత్రం ఆడియో విడుదల అయ్యి పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టిస్తుందన్నారు.

నగరంలో తలపెట్టిన ఆ చిత్రం ఫంక్షనకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలని చిరంజీవిపై రాజకీయ కక్షతో ఆ చిత్రం వేడుకలకు అనుమతి ఇవ్వటం లేదని అభిమానులు విమర్శించారు. రాజకీయాలు వేరు, సినిమా వేరు అని వారు పేర్కొన్నారు. చిరంజీవి చిత్రం వేడుకలకు నగరంలో అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: పూజలో రాగిపాత్రలను వాడడం వెనుక అసలు రహస్యం ఇదే

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ఇది కూడా చూడండి: మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్లతో ఏం మాట్లాడుతున్నారో ఈ సీక్రెట్ యాప్ ద్వారా తెలుసుకోండి

English summary

Mega Fans are Disappointed with Chandrababu naidu. He rejected permission for for Chiranjeev new movie Audio launch in Andhra pradesh