మెగా ఫాన్స్ కి ఇరకాటం

Mega Fans headache with Mega Heroes Movies

10:11 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Mega Fans headache with Mega Heroes Movies

2016 మెగా హీరోలకు అచ్చొచ్చినట్టు కనిపించడంలేదు. ఇప్పటి వరకూ వచ్చిన మెగా అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడమేకాదు, డిజాస్టర్లుగా మారిపోతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్యాన్స్ కు అంకితమంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్రంబొమ్మెక్కి అభిమానులతో ఆటలాడుకున్నాడు.

ఇవి కూడా చదవండి:ఆ రెస్టారంట్ లో తినాలంటే బట్టలిప్పాల్సిందే!

రాత్రనకపగలనకా అన్నీ తానై పనిచేశానంటూ అత్యంత చెత్త సినిమాని ఫ్యాన్స్ కి సమర్పించాడు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ సరైనోడు సినిమా కూడా బిలో యావరేజ్ మూవీగా మెగా ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసిందని అంటున్నారు. రేసుగుర్రం ఇక గతేడాది చివర్లో వచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ మూవీ బ్రూస్ లీ రింగులో ఫింగరై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఫ్యాన్స్ ఏం మాట్లాడాలో తెలీని విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాగా , హీరో బేస్ట్ మూవీస్ కు కాలం చెల్లిపోయిందని కంటెంట్, కెపాసిటీ ఉంటేనే వర్కౌటయ్యేదంటూ మరికొందరు సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెగా హీరోలు ఇచ్చిన బిల్డప్ లు చూసి , అంచనాలు పెంచేసుకున్న అభిమానులు మొత్తానికి ఇరకాటంలో పడ్డారు. వీర లెవెల్లో చెప్పేస్తే సరిపోదని , అందుకు తగ్గట్టు సినిమా వుండాలని కొందరు అభిమానులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:రణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

ఇవి కూడా చదవండి:ఫోర్జరీ సంతకాల కేసులో టివి నటికి మూడేళ్ల జైలు శిక్ష

English summary

Mega Fans were in deep depression with their heroes movies because Ram Charan Bruce Lee ,Pawan Kalyan's Sardaar Gabbar Sngh,And Now Sarainodu movies were not attracted Audience and became average at the box office.