షాక్ ఇస్తున్న మెగా బ్రదర్స్ 

Mega fans shocked by mega brothers

06:06 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Mega fans shocked by mega brothers

ఇటీవల ఫ్యాన్స్ కి మెగాహీరోలు తెగ షాక్ లు ఇస్తున్నారు. మొన్నటి వరకూ మెగాహీరోలు పవన్, చిరు లు ఒకరంటే ఒకరు తెలియనట్టుగా ఉన్నారు అలాగే వ్యవహరించేవారు కుడా .. దీంతో ఇలా ఉంటే ఫ్యూచర్ లో మీకే ప్రమాధం అంటూ అభిమానులు ఎంత మొత్తుకున్నా ఈ మెగా బ్రదర్స్ పట్టించుకోలేదు. తరువాత ఏమైందో ఏంటో తెలియదు కానీ, ఒక్కసారిగా మెగాహీరోలు అంతా కలిసిపోయారు. దీంతో అభిమానులు షాక్ కి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక దగ్గరనుండి మెగాహీరోలలో మార్పులు వచ్చాయట. రామ్ చరణ్ తో పవన్ కళ్యాన్ మూవీ తీయడం, మెగా స్టార్ ఇంటికి పవన్ కళ్యాణ్ రావటం, పవన్ మూవీ సెట్స్ వద్దకు చిరంజీవి రావటం, అలాగే చిరు పాటని పవర్ స్టార్ రీమిక్స్ చేయటం...ఇలా ఎన్నో జరుగుతూనే రావడం తో మెగా ఫాన్స్ షాక్ అవుతున్నారు. అంతే కాదు ఇప్పుడు చిరంజీవి, సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీలో కొన్ని సెకండ్ల పాటు కనిపించాడని అంటున్నారు. చిత్ర యూనిట్ చాలా గోప్యంగా దీనికి సంబంధించిన విషయాన్ని ఉంచిందని సమాచారం.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రిల్ 8న భారీ ఎత్తున రిలీజ్ సిద్దం కానుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఈనెల 20న పెద్ద ఎత్తున ఆడియోని విడుదల చేయనున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆత్రుత గా చూస్తున్నారు.

English summary

Sardaar Gabbar Singh is scheduled for a worldwide release on 8 April 2016 along with a Hindi dubbed version of the same name. Sardaar Gabbar Singh is an upcoming Telugu action film directed by K. S. Ravindra.