చిరుని పార్టీ ఇచ్చి పడగొట్టిన అల్లుడు

Mega Star Chiranjeevi son in law gave a party to the both families

10:57 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Mega Star Chiranjeevi son in law gave a party to the both families

ఇంకా పెళ్లి కాకుండానే మామకు దిమ్మ తిరిగే పార్టీ ఇచ్చాడట అల్లుడు. ఇక అల్లుడు గారు ఇచ్చిన పార్టీ హంగామా చూసి, మెగా స్టార్ చిరంజీవి ఫ్లాట్ అయిపోతే, ఇక రామ్ చరణ్-అల్లు అర్జున్ అయితే.. ఈ కుర్రాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదని అనేసారట. ఇంతకీ విషయమేమంటే, మెగా ఫ్యామిలీలోకి కొత్త అల్లుడు రాకకు సంబంధించి, పెళ్లికొడుకు-పెళ్లి కూతురులుగా చేసే ఫంక్షన్లు కూడా పూర్తయిపోయాయి. ఇక పెళ్లికి ముహూర్తం దగ్గర పడడంతో.. పెళ్లికొడుకు కళ్యాణ్ తల్లిదండ్రులు ఓ భారీ పార్టీ ఏర్పాటు చేసారట. పెళ్ళికొడుకు కళ్యాణ్ పేరెంట్స్ కెప్టెన్ కిషన్-జ్యోతి బంజారా హిల్స్ లోని తమ సొంత ఇంట్లో ఇచ్చిన ఈ పార్టీ కి దాదాపు రెండు ఫ్యామిలీల్లోని ముఖ్యులంతా జంటలుగా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

ముఖ్యంగా మొత్తం 150 మంది అతిథులు హాజరుకాగా.. మంగోలియన్-ఇటాలియన్-చైనీస్-ఇండియన్ ఫుడ్స్ తో ఈ పార్టీ అత్యద్భుతంగా సాగిందట. చిరంజీవి-సురేఖ, చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహలు జంటలుగా వస్తే.. అల్లు శిరీష్-సాయిధరం తేజ్-నీహారిక సహా అంతా ఈ ఈవెంట్ కు విచ్చేసినా, ఈ వేడుకలో పెళ్లి కూతురు శ్రీజ మాత్రం కనిపించలేదు. ఎందుకంటే, ఆచారం ప్రకారం పెళ్లికూతురును చేశాక.. మళ్లీ పీటల మీద తప్ప ఇక పెళ్లికొడుకును అమ్మాయి చూడకూడదు. అందుకే శ్రీజ ఈ పార్టీలో కనిపించలేదు. ఈ పార్టీలో అందరితో కలివిడిగా కళ్యాణ్ కలిసిపోతూ చేసిన సందడి చిరుని బాగా ఆకట్టుకుందట.

ఇది కూడా చదవండి: 'సర్దార్' లో షకలక శంకర్ ని తీసేసారా?

English summary

Mega Star Chiranjeevi son in law gave a party to the both families. And Chiranjeevi Son in law Kalyan mesmerized Chiranjeevi with his party.