ఖైదీ నెంబర్ 150

Mega star chiru kathilantodu khaidi number 150 look leaked

11:02 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Mega star chiru kathilantodu khaidi number 150 look leaked

సినిమాల్లో బిజీ గా వున్న మెగాస్టార్ చిరంజీవికి జైలులో అధికారులు రూమ్ అలాట్ చేశారు.. అతని కి ఇచ్చిన నెంబర్ 150... ఇదంతా చూసి, చిరంజీవి జైలుకి వెళ్లడమేంటి? అనుకుంటారు. కానీ ఇది రియల్ లైఫ్ లో కాదు.. ఇదంతా చిరు నటిస్తున్న ‘కత్తిలాంటోడు’ మూవీ సన్నివేశంలోనిది. దీనికి సంబంధించి ఓ పిక్ బయటకు వదిలారో వచ్చిందో కానీ ఆసక్తి కరంగా ఉంది.

ఇక సీన్ విషయాని కొస్తే.. ఇందులో చిరు డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. జైలు నుంచి ఎస్కేప్ అయిన ఖైదీలను ఎలా పట్టుకోవాలన్న ప్లాన్ లో భాగంగా జైలు అధికారులు చిరు సంప్రదిస్తారు. ఇందులోభాగంగా వాళ్లకి ప్లాన్ చెబుతూ అక్కడి నుంచి చిరు తప్పించుకునే సన్నివేశం.
ఇప్పటివరకు తెరకెక్కించిన సన్నివేశాలు బాగుండడంతో యూనిట్ ఫుల్ ఖుషీగా వుంది. 9 ఏళ్ళ తర్వాత చిరు ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తున్న షూటింగ్ చంచల్ గూడకి చేరింది. అక్కడ జైలులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక్కడి షెడ్యూల్ పూర్తికాగానే రామోజీ ఫిలింసిటీకి యూనిట్ షిప్ట్ కానుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచన లో మూవీ మేకర్స్ ఉన్నారట. మొత్తానికి ఈచిత్రానికి మాంచి బూస్టఫ్ ఇస్తున్నారండి.

ఇది కూడా చూడండి: ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

ఇది కూడా చూడండి: భారతదేశంలో సంచలన హత్యలు

ఇది కూడా చూడండి: పసుపు క్యాన్సర్ ని ఎలా అడ్డుకొంటుంది

English summary

Mega star chiru kathilantodu khaidi number 150 look leaked.