చిరంజీవి 150 వ సినిమాకు రైటర్లు కొరత!!

Megastar Chiranjeevi is worrying about his 150th film

11:13 AM ON 28th November, 2015 By Mirchi Vilas

Megastar Chiranjeevi is worrying about his 150th film

పద్మభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించబోయే 150 వ చిత్రం పై ఎన్నో కధనాలు వినిపించాయి. హీరోగా తను నటించిన శంకర్‌ దాదా జిందాబాద్‌ చిత్రమే లాస్ట్‌. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కూడా కాల్చుకున్నారు. అప్పుడెప్పుడో తనయుడు నటించిన మగధీరలో తళుక్కని మెరిశారు చిరంజీవి, రీసెంట్‌గా బ్రూస్‌లీ చిత్రంలో కూడా గెస్ట్‌రోల్‌ ప్లే చేశారు. అయితే చిరంజీవి హీరోగా మళ్లీ ప్రేక్షకులు ముందుకు రావాళంటే 150 వ చిత్రం కధ ఎంతో అద్భుతంగా ఉండాలని చిరు ఆలోచన. అలాంటి అద్భుతమైన సినిమాతో వస్తే ప్రేక్షకులు తనని మళ్లీ ఆధరిస్తారని చిరు నమ్మకం.

కానీ టాలీవుడ్‌లో మంచి రైటర్లు లేరని చిరు తెగ వర్రీ అవుతున్నారట, తన 150వ చిత్రం కోసం మంచి కధ రాయమని చాలా మంది రచయితలను కోరారని తెలిసింది. ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్‌, యండమూరి వీరేంధ్రనాధ్, సత్యానంద్‌ వంటి మహామహా రచయితలతో పని చేసిన చిరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టీ, అందుకు అనుగుణంగా కధని రాసే రచయితల కోసం ఎదురుచూస్తున్నారు. తన ఇమేజ్‌ రెట్టింపు అయ్యే కధ ఎవర్ని రాయమని కోరినా వాళ్ళు చెప్పే కధలు విని బోర్ కొట్టేస్తుందట. ఆ కధలు విని తన మిత్రులైన నిర్మాతలు, డైరెక్టర్లు వద్ద తెలుగు ఇండస్ట్రీలో మంచి కధలు రాసేవారే లేరని చెప్పి ఫీలైపోతున్నారట.

అప్పుడే సంవత్సరం నుండి పెద్ద రచయితలైన పరుచూరి బ్రదర్స్‌తో పాటు, కోన వెంకట్‌, పూరీ జగన్నాధ్‌, ఆకుల శివ వంటి పలువురు రచయితలను అడుగుతున్నా వాళ్లు చెప్పే కధలు చిరుకి నచ్చడంలేదని టాక్‌. ఇటీవల పూరీ జగన్నాధ్‌ వినిపించిన కధలో ఫర్స్ట్హాఫ్ నచ్చినా సెకండ్‌ హాఫ్‌ నచ్చకపోవడంతో చిరు వెనుకడుగు వేశారు. దీనితో చిరు 150వ సినిమాను డిసెంబర్‌లో అయినా మొదలు పెడతారా అన్నసందేహం నెలకొంది.

English summary

Megastar Chiranjeevi is worrying about his 150th film. In tollywood industry Story writers are very less and they don't have much talent when comparing to senior writers.