ఎక్స్‌ప్రెస్‌ రాజా లో మెగాస్టార్‌ 

Megastar In Express Raja Movie

03:44 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Megastar In Express Raja Movie

శర్వానంద్‌ హీరోగా నటించిన తాజా సినిమా ఎక్స్‌ప్రెస్‌ రాజా . ఈ సినిమాను స్టార్‌ హీరోల సినిమాలను ఛాలెంజ్‌ చేస్తూ సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఏమయినప్పటికి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదని సినిమా దర్శక నిర్మాతలు చెప్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం చిత్ర యూనిట్‌ కొన్ని ప్రత్యేకమైన ఫ్లాన్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఒక ఆసక్తి కరమైన వార్తను చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అదేమిటంటే జబర్‌దస్త్‌ కామెడీ షో ద్వారా బాగా పేరు పొందిన షకలక శంకర్‌ ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి గెటప్‌ లో " భీభత్స నటరాజ్‌ " పాత్రలో కనిపించనున్నారు. ఎమ్‌. గాంధీ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో శర్వానంద్‌ సురభి, సుషాంత్‌, బ్రహ్మజీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

English summary

Jabardasth Star shakalaka shankar acted a role of " Beebatsa Nataraj " character in Sarwanand's Upcoming Movie Express Raja