రూపాయికే మెయిజు ఫోన్..!

Meizu m2 smartphone Contest

05:43 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Meizu m2 smartphone Contest

ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తోంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే కనిపిస్తోంది. అయితే స్మార్ట్‌ ఫోన్‌ కొనాలంటే వేలు ఖర్చు పెట్టాలి. కానీ చైనాకు చెందిన మెయిజు కంపెనీ మాత్రం రూపాయికే స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామంటోంది. అయితే దీనికి షరతులు వర్తిస్తాయి. మెయిజు ఎం2 పేరుతో ఓ కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ ధర రూ.6,999. ఈ కామర్స్ వెబ్ సైట్ స్నాప్‌డీల్‌ ద్వారా అమ్మకానికి ఉంది. అయితే ఈ ఫోన్‌కు ప్రచారం కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.1 కే ఎం2 అంటూ ఆన్‌లైన్‌ కాంటెస్ట్‌ని ప్రకటించింది.

ఇందు కోసం మీరు ఏం చెయ్యాలంటే.. మెయిజు లోగో ఫోన్‌పై ఎక్కడ, ఎలా ఉంటే బాగుంటుంది? అనేదాని ఊహించి పెయింట్‌ చేసి ఆ చిత్రాన్ని మెయిజు ఇండియా ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చెయ్యాలి. ఈ నెల 15 నుంచి 21 వరకు ఈ పోటీ కొనసాగుతుంది. అలా వచ్చిన చిత్రాల్లో మంచి వాటిని సంస్థ ఎంపిక చేస్తుంది. అలా ఎంపికైన వారందరికీ రూ.1కే ఎం2 ఫోన్‌ని కంపెనీ అందజేస్తుంది. కాగా కాంటెస్ట్‌లో పాల్గొననివారు మాత్రం ఈ ఫోన్‌ను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఐఫోన్ 5సిని పోలిన పాలీకార్బనేట్ యూనిబాడీ, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Meizu smartphone company is offering an opportunity to buy the Meizu m2 for only Re. 1 for this the user had to visualize where they would like to see the ‘Meizu’ logo.This contest will be available from today to 21st december