ఫిలిప్పీన్స్‌లో మెలోర్ విధ్వంసం

Melor typhoon strikes Philippines

06:23 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Melor  typhoon strikes Philippines

ఫిలిప్పీన్స్‌లో మెలొర్‌ టైఫూన్‌ విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా మనీలా సహా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించి పోయింది. వరదనీరు నగర వీధుల్ని ముంచెత్తింది. రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకుంది. భీకర గాలులకు ఇళ్ల కప్పులు ఎగిరిపోయి.. విద్యుత్ స్థంభాలు.. చెట్లు నేలకూలాయి. పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. టైఫూన్‌ కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇంత బీభత్సం సృష్టించిన టైఫూన్‌ ఇటీవలి కాలంలో ఇదేనని మిండోరో రాష్ట్ర గవర్నర్‌ ఆల్ఫోన్సో ఉమాలి చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

English summary

Melor Typhoon strikes in Philippines,due to that typhoon thirteen people were died. The disaster also caused significant damage in several of the country’s provinces.