మగాడికి అమ్మదనం సాధ్యం అంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు!

Men can also give a birth to baby

01:14 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Men can also give a birth to baby

సృష్టికి ప్రతిసృష్టి చేసి విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించిన నాటి నుంచి నేటివరకూ మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేస్తూనే వున్నాడు. ఇక ప్రకృతీ పురుషుడి కలయికే సృష్టి అని శాస్త్రాలు చెబుతాయి. ప్రకృతి అంటే స్త్రీ అని అర్థం. పిల్లల్ని కనే శక్తి ఒక్క స్త్రీ జాతికి మాత్రమే ఉంది. అండం పిండమై మాతృగర్భంలో నవమాసాలూ ఉన్నాక ఈ భూప్రపంచంలోకి వస్తుంది. అయితే భవిష్యత్తులో ఆ శక్తి మగాడికి కూడా వస్తుందని బిట్రన్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్త్రీ సంపర్కం లేకుండానే పురుషుడు బిడ్డల్ని కనగలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ దిశగా జరిగుతున్న పరిశోధనల్లో పురోగతి కనిపిస్తోందట! మహిళల ప్రమేయం లేకుండా బిడ్డల్ని కనేందుకు ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియ కోసం శాస్త్రవేత్తలు రీసెర్చ్ మొదలుపెట్టారు.

1/4 Pages

మామూలుగా అయితే స్త్రీలోని అండం - పురుషుడి నుంచి విడుదలైన వీర్యకణం కలిసి ఫలధీకరణ చెంది పిండంగా మారతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా అండానికి బదులు చర్మ కణంతో వీర్యాన్ని కలిపి, ఫలదీకరించి పిండాన్ని ఉత్పత్తి చేయబోతున్నారు. ఈ ఆలోచన ప్రస్తుతానికి కాస్త ఊహాజనితంగా అనిపిస్తున్నా, భవిష్యత్తులో నిజమయ్యే రోజులు వస్తాయని బ్రిటన్ సైంటిస్టులు కొండంత ఆశతో వున్నారు. పరిశోధనల్లో భాగంగా కొన్ని ఎలుకలపై ఈ పద్ధతిని ప్రయోగించి చూశారు. వీర్యకణాలకు అండ కణాలు జతచేసి ఎలుకలు ఇంజెక్ట్ చేశారు. ఆరోగ్యవంతమైన పిండాలను ఉత్పత్తి చేయడంలో సక్సెస్ అయ్యారు.

English summary

Men can also give a birth to baby