మగాళ్లూ.. ఆన్ లైన్ డేటింగ్ లో అప్ డేట్ కావాలట..

Men Have To Develop In Online Dating Conversation

04:54 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Men Have To Develop In Online Dating Conversation

ఆన్ లైన్ డేటింగ్ లో మాట్లాడటంలో మగాళ్లు బాగా వెనుకబడి ఉన్నారట. అందుకే వారు ఆన్ లైన్ డేటింగ్ సమయంలో సంభాషించడంలో అప్ గ్రేడ్ కావాలట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ప్రముఖ డేటింగ్ యాప్ ట్రులీమ్యాడ్లీ ద్వారా నిర్వహించిన ఈ అధ్యయనంపై పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగుచూశాయి.

ట్రులీ మ్యాడ్లీ గత ఏడాది అక్టోబర్ లో తన యూజర్లపై ఈ సర్వే చేసింది. మొత్తం 550 మంది మహిళలు ఇందులో పాలుపంచుకున్నారు. వీరిలో 18-25 ఏజ్ గ్రూప్ కు చెందిన 63 శాతం మంది మగాళ్లు ఆన్ లైన్ డేటింగ్ సమయంలో సంభాషణల స్కిల్స్ ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26-35 ఏళ్ల మధ్య వయసున్న73 శాతం మంది కూడా సరిగ్గా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారట.

సంభాషణలను ఆసక్తికరంగా మలచుకోవడం ఎలాగో తెలుసుకోగలిగితే భారతీయ మగాళ్లు సులువుగా ఆన్ లైన్ డేట్ ను గుర్తించవచ్చని ట్రులీ మ్యాడ్లీ లో కంటెట్ హెడ్ అయిన విమోహ బగ్లా పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 18-25 ఏజ్ గ్రూప్ లో ఉన్న యువతుల్లో 29 శాతం మంది తాము ఆన్ లైన్ లో సాధారణ సంబంధాలను మాత్రమే కోరుకుంటున్నట్టు వెల్లడించారట. అయితే 26-35 ఏళ్ల వయసు గ్రూప్ లోని 88 శాతం మందికిపైగా మహిళలు లాంగ్ టెర్మ్ రిలేషన్షిప్ కోసం చూస్తున్నామని చెప్పారట. 26-35 ఏళ్ల వయసు గ్రూప్ లోని సుమారు సగం మంది మహిళలు డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తితో కనీసం ఒక్కసారైనా కలుసుకున్నారట. ఇదే 18-25 ఏళ్ల వయసు అమ్మాయిల్లో 36 శాతం మంది యాప్ లో పరిచయమైన వ్యక్తితో డేట్ కు వెళ్లారట. మొత్తంగా చూస్తే 38 శాతం మంది మహిళలు తాము ఉన్న నగరంలో నివసిస్తున్న వ్యక్తులతో డేటింగ్ కే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట.

రిలేషన్షిప్ లో ఉంటే మనుషులు మారిపోతారా..?

చూపుతో మీ కోరికలను అంచనా వేసేస్తారట

ఆత్మహత్యకు ప్రేరేపించే కారణాలు

పుట్టుమచ్చల బట్టి మీ మనస్తత్వం

English summary

Men need to upgrade their conversation skills for online dating, says a nationwide research conducted by dating app TrulyMadly.