ఫస్ట్ లుక్ లోకి వచ్చేసిన 'మెంటల్ పోలీస్'

Mental Police First Look

11:23 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Mental Police First Look

శ్రీకాంత్ నటిస్తున్న ‘మెంటల్ పోలీస్’ ఫస్ట్‌లుక్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో విడుదల అయింది . మెడలో చెప్పుల దండను వేసుకుని ఖాకీ చొక్కా పట్టుకుని ఈ లుక్‌లో శ్రీకాంత్ కనిపిస్తున్నాడు. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల తర్వాత ఫవర్‌ఫుల్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్న 'మెంటల్ పోలీస్' అనగాని ఫిలిమ్స్‌, సుబ్రమణ్యేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు వి.వి.దుర్గాప్రసాద్‌ అనగాని నిర్మాతగా వ్యవహారిస్తుంటే, వి.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్ దాసరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మహాత్మా తో 100 చిత్రాలు గతంలోనే పూర్తిచేసుకుని ఇప్పుడు తనయుడిని కూడా తెరంగేట్రం చేయిస్తున్న శ్రీకాంత్ 'మెంటల్ పోలీస్' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి .

English summary

Hero Srikanth's upcoming film "Mental Police" first look was released by film unit on the occasion of Republic Day.In this film srikants acted as Policeful Police Officer.This movie will be released in February