ఫేస్‌బుక్‌తో మానసిక సమస్యలు ఖాయం

Mental Problems Rise With Facebook

11:30 AM ON 27th November, 2015 By Mirchi Vilas

Mental Problems Rise With Facebook

ఫేస్‌బుక్‌...ఈ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని ప్రతీ ముగ్గురిలో ఒక్కరికీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. టీనేజర్లు అయితే రోజంతా ఫేస్‌బుక్‌లోనే గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌ వాడకం శృతిమించితే మానసిక రుగ్మతలు తప్పవని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు. కెనడాకు చెందిన మొంటరీల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 300యువకులపై చేసిన పరిశోధనలో ఫేస్‌బుక్‌లో ఎక్కువ సమయం గడిపిన వారిలో మానసిక ఒత్తిడిని పెంచే హార్మోన్లను అధికంగా గుర్తించారు. ఫేస్‌బుక్‌లో గడిపే యువతీయువకులు తమ ఫ్రెండ్స్‌ పోస్ట్‌ చేసే వాటికి లైక్‌లు, కామెంట్‌లు చేసే విషయంలో ఆందోళనకు గురవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే తాము అప్‌లోడ్‌ చేసే ఫొటోలకు లైక్‌లు, కామెంట్లు రాకపోయిన సందర్భంలో కార్టిసోల్‌ అనే హర్మోన్‌ విడుదల అవ్వడంతో మానసిక ఒత్తిడికి కారణమవుతుంది.

English summary

A recent survey on facebook relieves that who use facebook more then there is a high chance of getting mental problems. Researcher professor Sonia Lupien finds a new study by researchers at University of Montreal, Canada.