100 కిమీ వేగంతో ఢీ.. గాల్లో ఎగిరాక ఏమైంది?(వీడియో)

Mercedes Benz gave dash to boy with 100 km speed

04:45 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Mercedes Benz gave dash to boy with 100 km speed

న్యూఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని, ఈ ప్రమాదంలో సిద్ధార్థ శర్మ(32) అనే యువకుడు మృతి చెందాడు. శర్మ ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన మెర్సిడెస్ కారు సిద్ధార్థ శర్మని ఢీకొట్టింది. దీంతో సిద్ధార్థ శర్మ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. ఇంత జరిగినా కారు స్లో చేయలేదు సరికదా, అంతే వేగంగా పేవ్‌మెంట్‌ మీదకు దూసుకుపోయాడు. అయితే కారు ఫ్రంట్ టైరు పగిలిపోవడంతో ఆటోమేటిక్ గా ఆగిపోయింది. లేకుంటే మరింత విధ్వంసం సృష్టించేదే. అమాంతం గాలిలోకి లేచిన సిద్ధార్థ శరీరం.. నిర్జీవమై రోడ్డు పై పడింది. అతను అక్కడిక్కడే మృతి చెందాడు.

ఇది కూడా చదవండి: చెల్లిని గర్భవతిని చేసిన అన్న

ఇంతకీ కారుతో ఢీకొట్టింది ఎవరంటే, బాగా డబ్బు సంపాదించిన ఓ సంపన్నుడి కొడుకు. అంతే కాదు అతడు మైనర్‌ కూడా... ఇంటర్ పరీక్షలు ముగిశాయన్న ఆనందంతో కారులో స్నేహితులతో జల్సా చేస్తూ.. కన్నూ మిన్నూ గానక మితిమీరిన వేగంతో ఈ ప్రమాదానికి ఒడి గట్టాడు. ఆ వెంటనే సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో సంపన్నుడైన అతని తండ్రి పై అభియోగాలు మోపారు.

ఇది కూడా చదవండి: ఛీ ఛీ.. ఐఏఎస్ ఇంట్లో టీవీ తారల వ్యభిచారం

ఈ ప్రమాదంలో తన ఒక్కగాను ఒక్క కొడుకును కోల్పోయిన హేమ్‌రాజ్ శర్మ బోరున విలపిస్తూ, పోలీసుల విచారణ ఓ జోక్‌లా కనిపిస్తోందని, సంపన్నుడైన నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి నేరగాళ్లకు శిక్ష విధించకుంటే రేపొద్దున మీ కుటుంబాలకు తన కుటుంబానికి వచ్చిన పరిస్థితే వస్తుందని అంటున్నాడు.

ఇది కూడా చదవండి: ఎయిర్ హోస్టెస్ లు విమానంలో ఆ పనులు కుడా చేస్తారట

English summary

Mercedes Benz gave dash to boy with 100 km speed. Siddharth Sharma hitted by Mercedes Benz cae with 100 km speed.