విషం ఉందని తేల్చిన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్

Methyl Alcohol Found In Kalabhavan Mani Postmortem Report

04:19 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Methyl Alcohol Found In Kalabhavan Mani Postmortem Report

ఒక ఆటో డ్రైవర్ గా పని చేసి ఆ తరువాత సినీ రంగంలోకి విలన్ పాత్రతో తన నటనా జీవితాన్నిప్రారంభించిన కళాభవన్ మణి ఆ తరువాత హాస్య నటుడిగా , గాయకుడిగా, సంగీత దర్శకుడిగా , సినీ రచయితగా ఇలా సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యెక గుర్తింపు తెచుకున్న విలక్షణ నటుడు కళాభవన్ మణి. దక్షినాది చిత్ర సీమలో తనకంటూ ఒక స్థానం తెచుకున్న కల భవన్ మణి ఈ నెల 7 వ తేదిన అకస్మాత్తుగా చనిపోయారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మొదట కాలేయ సంబంధిత వ్యాధితో చనిపోయారని భావించినప్పటికీ , ఆ తరువాత ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కళాభవన్ మణి విషపూరితమైన ఆల్కహాల్‌ను కళాభవన్‌ తాగి ఉంటాడని, ఎవరో కావాలనే ఈ విధమైన విషప్రయోగం జరిపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు .

పోలీసుల అనుమానించినట్లుగానే కళాభవన్ మణి మృతికి అసలు కారణం విషపూరితమైన ఆల్కహాల్ అని పోలీసులు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ లో తేలిపోయింది . దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డాక్టర్ లు శుక్రవారం విడుదల చేసిన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ లో కళా భవన్ మణి విసేరా నమూనాలలొ క్లోర్‌ఫైరిఫోస్, మిథైల్, ఎథైల్ ఆల్కాహాల్ లాంటి అత్యంత ప్రమాదకరమైన క్రిమిసంహారక మందులు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే కళాభవన్ మృతి కేసు లో నిజాలు బయటపెట్టేందుకు కళాభవన్ మణి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఈ అంశం పై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని కేరళ ముఖ్య మంత్రి ఉమెన్ చాందీ హామీ ఇచ్చారు.

కోపం వద్దు, ఫస్ట్‌ వినండి.... నాగ్‌తో ఎన్టీఆర్‌

అందుకే మహేష్ బాబు తో యాక్ట్ చెయ్యను

నటుడు కళాభవన్ మణి మృతి

సర్దార్ ఫంక్షన్లో పవన్ ఎమోషనల్ స్పీచ్

English summary

Recently Actor Kala Bhavan Mani died in a controversial way and soo many questions have been raised on his death. Recently Police found that Methyl alcohol have been found in Kala Bhavan mani viscera samples. Doctors have approved that and Kerala Chief Minister said that if the family of Kala Bhavan Mani permits then the government will put a separate investigation team on his death.