మోడీ డ్రైవర్ మెక్సికో అధినేత

Mexico President Drives Car For Modi

12:27 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Mexico President Drives Car For Modi

అవునా, చాయ్ వాలా భారత్ ప్రధాని అయితే, ఆయన డ్రైవర్ మిక్సికో అధినేతా...ఇదేదో ఇంటరెష్టింగ్ గా వుందే....అయితే ఓ సారి వివరాల్లోకి వెళ్ళాల్సిందే. దేశాధినేతలకు ఆతిథ్య దేశాలు సమున్నత గౌరవం ఇవ్వడం షరా మామూలే. అయితే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళారంటే అన్నీ అరుదైన మధుర క్షణాలనే ఆస్వాదిస్తున్నారు. ఆయా దేశాధినేతలతో కలుపుగోలుగా మాట్లాడుతూ భారతదేశం గొప్పదనాన్ని వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. పనిలో పనిగా భారతదేశానికి రావాల్సినవి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇతరుల మనసును ఎంతగా దోచుకుంటున్నారో తెలియాలంటే మెక్సికోలో జరిగిన పరిణామాలను పరిశీలించి తీరాల్సిందే.

ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం రాత్రి మెక్సికో వెళ్ళారు. మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత భోజనం కోసం మెక్సికో సిటీలోని ఓ రెస్టారెంట్ కు తీసుకెళ్ళారు. అప్పుడు కూడా ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మెక్సికో అధ్యక్షుడే స్వయంగా కారు నడుపుతూ మోడీని రెస్టారెంట్ కు తీసుకెళ్ళారు. ఆ రెస్టారెంట్ లో ఇద్దరూ శాకాహార భోజనం చేశారు. బీన్ టకోస్ తింటూ సాదరంగా ముచ్చటించుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి వికాస్ స్వరూప్ అరుదైన ఈ పిక్ లను ట్వీట్ చేశారు. అదండీ సంగతి...

English summary

Indian Prime Minister Narendra Modi was in Foreign tour to Mexico and yesterday Mexico President drives car himself and went to to a restaurant and ate lunch. This photo was going viral over the internet.