ఎపిలో పెట్టుబడులకు 'మియర్‌ బర్గర్‌' ఒకే

Meyer Burger To Invest In Andhra Pradesh

05:27 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Meyer Burger To Invest In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ ప్యానెల్‌ తయారీ సంస్థ స్థాపనకు మియర్‌ బర్గర్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో ఈనెల 20నుంచి 23వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 46వ వార్షిక మీట్ లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం వెళ్ళింది. ఇందులో భాగంగా జ్యురిక్‌లో ప్రారంభమైన ఇన్వెస్టర్‌ మీట్‌ సందర్భంగా మియర్‌ బర్గర్‌ సంస్థ ప్రతినిధులతో ఎపి సిఎమ్ చంద్రబాబు బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా విశాఖ, రాజమహేంద్రవరంలో పెట్టుబడులకు ఆ కంపెనీ ఆసక్తి కనబర్చింది. తమ ఉత్పత్తుల్లో 50శాతం ఎగుమతి చేసి, మిగిలిన 50శాతం ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తామని కంపెనీ ప్రతిపాదించగా, దీనికి అంగీకరించిన చంద్రబాబు స్పందిస్తూ, సంస్థ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తామని మియర్‌ బర్గర్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

English summary

Popular solar panels manufacturing company Meyer Burger was ready to invest in Andhra Pradesh. Previously This company conducted a meeting with Andhra Pradesh Cheif Minister Nara Chandra Babu Naidu in Singapore