అమెరికా రాయబారిగా పోర్న్ స్టార్!

Mia Khalifa as a American ambassador

11:29 AM ON 26th November, 2016 By Mirchi Vilas

Mia Khalifa as a American ambassador

అమెరికాలో ఎన్నికల అంకం ముగియడంతో తదుపరి చర్యలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హయాంలో కీలక పదవుల్లో నియమించేందుకు కొందరిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి ఆయన మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఆమెకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి పదవి ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఇది కేబినెట్ స్థాయి పదవిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాల్కమ్ రోడ్రిగెజ్-గెల్డ్ స్టెయిన్ అనే అమెరికా పౌరుడు ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చారు.

అదేమిటంటే, ప్రముఖ పోర్న్ నటి మియా ఖలీఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలంటూ ఆన్ లైన్ పిటిషన్ ను ప్రారంభించారు. దీనికి 1,500 మంది సంతకాలు చేయవలసి ఉంటే, ఇప్పటికే 1,200 మంది సానుకూలంగా స్పందించి సంతకాలు చేసేసారు. మరి ఈ పోర్న్ స్టార్ దశ తిరిగినట్టేనా?

English summary

Mia Khalifa as a American ambassador