పిల్లాడే కదా అని ముద్దులు కురిపిస్తే ..

Michelle Mone Funny moment In Vietnam

10:49 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Michelle Mone Funny moment In Vietnam

అల్టిమో అండర్ వేర్. లింగరీస్ చైన్ ఓనర్, బ్రిటిష్ ఎంపీ కూడా అయిన మిషెల్లీ మూన్‌కు వియత్నాంలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన వ్యాపార విస్తరణతోబాటు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వియత్నాం వెళ్ళిన ఈమె.. సుమారు మూడు వేలమంది ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడేందుకు వేదికనెక్కింది. ఈ సందర్భంగా ఆమెకు వెల్ కం చెబుతూ దాదాపు రెండున్నర అడుగుల ఎత్తున్న ఓ కుర్రాడు అక్కడికి వచ్చాడు. ఆ పిల్లాడు నవ్వుతూ ఫ్లవర్ బొకే ఇవ్వగా.. ముచ్చట పడిన మూన్.. వాడ్ని ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించడమే గాక.. సెల్ఫీలు కూడా దిగింది. ఈ తతంగం సాగుతుండగా.. ఓ మహిళ పెట్టిన కేక మూన్‌ని షాక్‌కి గురి చేసింది.

ఇవి కూడా చదవండి:మహేష్ మాటలు పేలాయి...

ప్లీజ్.. అతడ్ని కిందికి దింపండి.. నేను అతని భార్యను.. అంటూ ఆ మహిళ అరవగానే మూన్ బిత్తరపోయింది. తాను ఆ కుర్రాడ్ని ఆరేళ్ళ అబ్బాయనుకుని పోరాబదిందట. తను ఎత్తుకున్నది అబ్బాయి కాదని, 46 ఏళ్ళ పొట్టి వ్యక్తినని తెలుసుకుని ఆశ్చర్యపోయిందట. ఈ విషయాలను ఆ తర్వాత ట్వీట్ చేసింది. అన్నట్టు ఈమెకి బ్రాల దొరసానిగా కూడా పేరుంది.కాగా ఈ ఘటన 6 నెలల క్రితమే జరగగా.. శనివారమే జరిగినట్టు మూన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడం విశేషం. తన ఉత్పాదనలను ప్రమోట్ చేసుకునేందుకు మూన్ ఆడిన ఫేక్ నాటకమే ఇదని కామెంట్స్ రాగా.. ఆమె ప్రతినిధి మాత్రం దీన్ని ఖండించాడు. ఇలాంటి డ్రామాలు ఆడే ఖర్మ మూన్‌కు లేదన్నాడు. ఏది ఏమైనా మూన్‌కు కలిగిన అనుభవం నాడు అనేకమందిని నవ్వుల్లో ముంచెత్తింది.

ఇవి కూడా చదవండి:కాజల్ బ్యాక్ అంటే మహేష్ సెంటిమెంట్

English summary

World's Famous lingerie tycoon Michelle Mone got surprised in Vietnam on the promotion of her product Campaign in Vietnam. When she was in her campaign she saw a Small person and she thought he was a 6 year old boy and she used to kiss her and taken selfies. But the person was a 46 year old man and his wife Shouted that he was her Husband.Michelle Mone got shocked by this movie and posted that photo by exlpaining by this incident.