కాన్వాస్ ఫైర్ 4జీ+ను విడుదల చేసిన మైక్రోమ్యాక్స్

Micromax Released Canvas Fire 4G+

06:02 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Micromax Released Canvas Fire 4G+

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ లో కాన్వాస్ ఫైర్ 4జీని విడుదల చేయగా.. ఇప్పుడు కాన్వాస్ ఫైర్ 4జీ+ను కంపెనీ వెబ్‌సైట్‌లో ఫోన్ల జాబితాలో చేర్చేసింది. అయితే ఫోన్ ధర, మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే వివరాలు వెల్లడించలేదు. కాన్వాస్ ఫైర్ 4జీ+ ఫోన్ ఫీచర్లు..

4.7 అంగుళాల తెరతో ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వెర్షన్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 1 జీబీ ర్యామ్ 1 గిగాహెడ్జ్ ప్రాసెసర్ తో పనిచేయనుంది. 8 ఎంపీ వెనుక కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 ఎంపీ ముందు కెమెరా ఉంది. డ్యుయల్ సిమ్, 4జీ సదుపాయం అదనపు ప్రత్యేకత. డ్యుయల్ ఫ్రంట్ స్పీకర్స్ తో వినియోగదారులకు మంచి సౌండ్ అనుభూతిని అందించనుంది. 2000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.

English summary

Micromax mobile company recently launched canvas fire 4g and now a new smart phone named canvas 4g+ was announced by micromax