మైక్రోసాఫ్ట్ చేతికి స్విఫ్ట్‌కీ

Microsoft Acquires Swift KeyBoard App

09:26 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Microsoft Acquires Swift KeyBoard App

ప్రముఖ కీబోర్డ్ యాప్ స్విఫ్ట్‌కీని సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. దీంతో ఇకపై స్విఫ్ట్‌కీ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ సిబ్బందితో కలిసి పనిచేయనున్నారు. ఈ లావాదేవీకి సంబంధించిన అధికారిక లెక్కలను ఆయా సంస్థలు బయటకు విడుదల చేయకున్నా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 250 మిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ ఈ యాప్‌ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇప్పటి వరకు స్విఫ్ట్‌కీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో మాత్రమే లభిస్తోంది. కాగా దీన్ని రానున్న విండోస్ 10 మొబైల్ డివైస్‌లలో డిఫాల్ట్ కీబోర్డ్ యాప్‌గా అందించనున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌ను 30 కోట్ల మంది వాడుతుండగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్‌లలో దీన్ని మైక్రోసాఫ్ట్ కొనసాగించనుంది. 2014 ఫిబ్రవరిలో సత్యనాదెళ్ల సీఈవోగా నియామకం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కొత్త తరహా సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలోకి స్విఫ్ట్‌కీ చేరింది. ఇటీవలి కాలంలో అకాంప్లి, వండర్‌లిస్ట్, సన్‌రైజ్ తదితర స్టార్టప్ యాప్స్‌ను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. ఇతర మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను దీటుగా ఎదుర్కొనేందుకే మైక్రోసాఫ్ట్ నూతన యాప్‌ల కొనుగోళ్లపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

English summary

Microsoft Company Popular smarrtphone Keyboard App SwiftKey. This was announced by Swift Keyboard and now Swift Keyboard employyes to join the Microsoft team..Microsoft Purchased Swift Keyboard For Rs. 1,702 crores