ఈ ప్రగతిలో  మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం

Microsoft CEO Satya Nadella Meets A.p CM ChandraBabu

11:37 AM ON 28th December, 2015 By Mirchi Vilas

Microsoft CEO Satya Nadella Meets A.p CM ChandraBabu

విశాఖలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ అంగీకారం తెల్పింది. ఈ ప్రగతిలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కానుంది. ఎపిలో వ్యవసాయం - విద్య - వైద్య , పౌర సేవల్లో మెరుగైన సేవలకోసం మైక్రోసాఫ్ట్ అవాగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు తెలుగువాడు - సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈవో) సత్య నాదెళ్ల సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సత్య నాదెళ్ళ కు సిఎమ్ చంద్రబాబు సాదర స్వాగతం పలికి , లోపలకు తోడ్కొని వెళ్ళారు. సుమారు గంటకుపైగా జరిపిన సమావేశంలో పలు అంశాలపైనా ఇరువురు చర్చించారు. ఎపిలో ఈ గవర్నెన్స్ అమలు తీరుపై ఆయన హర్షం వ్యక్తంచేసారు వీరిద్దరీ మధ్య సాగిన సమావేశం అనంతరం వివరాలను ఐటి మంత్రి పల్లె రఘునాధ రెడ్డి వెల్లడించారు.

విద్య, వ్యవసాయం రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్య కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఏపి ప్రభుత్వాన్ని నాదెళ్ల అభినందించారు. వచ్చే ఏడాది అనంతపురం జిల్లాలో పర్యటిస్తానని సత్య నాదెళ్ల తెలిపినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రగతిలో మైక్రిసాఫ్ట్ భాగస్వామ్యం అలాగే మైక్రోసాఫ్ట్ అందించే ‘అజూర్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ పవర్ బీఐ' ద్వారా పాఠశాలల్లో డ్రాపవుట్లకు తగిన పరిష్కారాలతో చెక్ పెట్టవచ్చునని అంటున్నారు. నిజానికి నాదెళ్ల పర్యటనకు ముందే మైక్రోసాఫ్ట్ ఇండియా ఏపికి పిఓసి (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) ప్రకారం సాంకేతికంగా సహకరించనున్నట్టు తెలిపింది. ఏపికి క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వ్యవసాయం, విద్య, పౌరసేవా రంగాల్లో మరింత సమర్ధంగా పనిచేయడానికి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, ఎగ్జిక్యూటివ్‌లకు క్లౌడ్ టెక్నాలజీ, మరికొన్ని అంశాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. వ్యవసాయంలో ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేయవచ్చనే అంశాన్ని ముందుగా తెలుసుకుని మెరుగైన ఉత్పాదకత సాధించేందుకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ దోహదం చేస్తుందన్న నమ్మకం ఎపి ప్రభుత్వం వ్యక్తపరుస్తోంది.

English summary