ఐఐటీ విద్యార్థికి మైక్రోసాఫ్ట్‌ ఇచ్చిన ఆఫర్‌ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

Microsoft company gave a shocking offer to IIT student

11:04 AM ON 5th December, 2016 By Mirchi Vilas

Microsoft company gave a shocking offer to IIT student

పెద్ద పెద్ద కంపెనీలు భారీగా జీతంతో ఆఫర్ లు ప్రకటించడం రివాజు. కానీ ఐఐటీ-కాన్పూర్‌ విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ఈ విద్యార్థికి శుక్రవారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఏడాదికి రూ.1.5కోట్లను వార్షిక వేతనంగా చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఐఐటీ కాన్పూర్‌ చరిత్రలో ఓ విద్యార్థి ఇంత మొత్తంలో వార్షిక వేతనంగా అందుకోవడం ఇదే తొలిసారి విశేషం. గతేడాది నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థి రూ.93లక్షలు వార్షిక వేతనంగా అందుకున్నాడు. అయితే, ఈ ఏడాది 200 కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ఓలా, ఉబెర్‌, పేటీఎం, అమెజాన్‌ వంటి ఆన్‌ లైన్‌ సేవలందించే సంస్థలూ ఉండడం విశేషం.

English summary

Microsoft company gave a shocking offer to IIT student