విండోస్ 10తో లూమియా 550

Microsoft Launched Microsoft Lumia 550

06:36 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Microsoft Launched Microsoft Lumia 550

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో అతి చవకైన మొబైల్‌ను విడుదల చేసింది. లూమియా 550 పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ మొబైల్ ను మైక్రోసాఫ్ట్ యూరోప్‌లో విడుదల చేసింది. ఇప్పుడు భారత్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది. రూ.9,399 ధరకు ఇది వినియోగదారులకు లభిస్తోంది. ఇందులో 4.7 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ, బ్లూటూత్ 4.1, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ, విండోస్ 10 మొబైల్ ఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ గ్లాసీ వైట్, మ్యాట్ బ్లాక్ రంగుల్లో లభ్యమవుతోంది. కంపెనీ విండోస్ 10తో విడుదల చేసిన అతి తక్కువ ధర ఫోన్ ఇదే. ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే నోటిఫికేషన్లను చూసుకునే వెసులుబాటు ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఎస్‌డీ కార్డు సాయంతో అంతర్గత మెమరీని 200 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ మొబైల్ సింగిల్ సిమ్‌తో పనిచేస్తుంది.

English summary

Microsoft company launched Microsoft's Lumia 550, soon after going on sale in Europe last week, has now been launched in India. The company on Friday confirmed that the Microsoft Lumia 550 will be going on sale in India priced at Rs. 9,399