మైక్రోసాఫ్ట్‌ నుంచి సర్ఫేస్‌ ప్రో3, ప్రో4

Microsoft Launched Surface Pro 4, Surface Pro 3

05:35 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Microsoft  Launched Surface Pro 4, Surface Pro 3

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సరికొత్త టాబ్లెట్లను భారత్ లో విడుదల చేసింది. సర్ఫేస్‌ ప్రో3, ప్రో4 ట్యాబ్లెట్‌ మోడళ్లను రిలీజ్ చేసింది. వీటిని ప్రముఖ ఆన్ లైన్ స్టోర్ అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. గురువారం నుంచి వీటికి ప్రీ బుకింగ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి ఈ నెల 14 నుంచి ప్రొడక్ట్ ల షిప్పింగ్‌ను ప్రారంభించనుంది.

సర్ఫేస్‌ ప్రో 3 ఫీచర్లు ఇవీ..

ప్రో 3 మోడల్ ప్రారంభ ధర రూ.73,990. 12 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, 2160*1440 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఐ3 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, 5 మెగాపిక్సల్‌ వెనక కెమేరా, 5 మెగాపిక్సల్‌ ముందు కెమేరా, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టం, రూ.12,490 అదనంగా చెల్లిస్తే స్మార్ట్‌ కీబోర్డ్‌ కూడా అందిస్తుంది.

సర్ఫేస్‌ ప్రో 4 ఫీచర్లు ఇవే..

ఐ5 ప్రాసెసర్‌, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, 4 జీబీ ర్యామ్‌ గల ప్రో4 మోడల్‌ ధర రూ.89,990, ఐ5 ప్రాసెసర్‌, 256ఎస్‌ఎస్‌డీ, 8జీబీ ర్యామ్‌ గల ప్రో4 మోడల్‌ ధర రూ.1,20,990, ఐ7 ప్రాసెసర్‌, 256ఎస్‌ఎస్‌డీ, 8జీబీ ర్యామ్‌ గల ప్రో4 మోడల్‌ ధర రూ.1,44,990, 12.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, 2736*1824 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టం, 8 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 9 గంటల బ్యాటరీ స్టాండ్‌బై తదితర ఫీచర్లు ఉన్నాయి.

English summary

Microsoft announced the launch of the Surface Pro 4 in India. The price of Microsoft's hybrid computing device starts at Rs. 89,990.This was exclusively available on Amazon