మైక్రోసాఫ్ట్ నుంచి లూమియా 650

Microsoft Lumia 650 Smartphone

11:12 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Microsoft Lumia 650 Smartphone

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందించనుంది. లూమియా సిరీస్ లో లూమియా 650 పేరిట ఈ కొత్త విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను యురోప్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.13,500. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ యూరోప్ వినియోగదారులకు లభిస్తుండగా, త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది.

లూమియా 650 ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ అమోలెడ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, విండోస్ 10 మొబైల్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

English summary

Technology Giant Microsoft launched a new windows mobile name Lumia 650.This smartphone comes with the key features like 5 inch display, 5-megapixel front camera,8-megapixel rear camera,16GB internal storage,1GB RAM,2000mAh Battery