ఐఓఎస్ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ న్యూస్ ప్రో

Microsoft News Pro App For iOS Users

11:01 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Microsoft News Pro App For iOS Users

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ యాపిల్ ఐఓఎస్ యూజర్ల కోసం న్యూస్ ప్రో పేరిట ఓ సరికొత్త న్యూస్ యాప్‌ను విడుదల చేసింది. ఐఓఎస్ 9 వెర్షన్ ఉన్న ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులు దీన్ని యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, డిజైన్, ఫైనాన్షియల్స్, రియర్ ఎస్టేట్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మానుఫాక్చరింగ్ వంటి వివిధ రకాల విభాగాలు ఈ న్యూస్ ప్రో యాప్‌లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్ ఇంజిన్ ఆధారంగా ఈ యాప్ యూజర్లకు వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ సైట్ల ద్వారా లాగిన్ అయితే యూజర్లు తమకు నచ్చిన ఆర్టికల్స్‌ను చదువుకునే వీలు కల్పించారు.

English summary

Microsoft company released a new mobile news app for iOS users. The name of that app was "News Pro".iOS users can dopwnload this app from iOS store.By using this app Users can read articles of their own choice.